బీఎస్ 6 వస్తున్న తరుణంలో భారత స్టేజ్(బీఎస్)-4 డెడ్ లైన్ మార్చి 31 దగ్గర పడుతోన్న సమయంలో బైక్స్ పై భారీ ఆఫర్స్ ప్రకటించారు. అయితే అద్భుతమైన భారీ ఆఫర్స్ ఏంటి అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి.. నచ్చితే వెంటనే కోనేయండి. 

 

​హోండా..

 

హోండా సంస్థ తన బీఎస్4 యాక్టివా 5జీపై దాదాపు 6,500 రూపాయల డిస్కౌంట్ ఇచ్చింది. ఎక్స్ షోరూంలో ఈ స్కూటర్ ఖరీదు రూ.55,934. 

 

హోండా బైక్ సీబీ 100ఆర్ పై 2 లక్షల రూపాయల డిస్కౌంటు ప్రకటించింది సంస్థ. ఈ బైక్ ధర రూ.14.4 లక్షలు. 

 

హోండా సీబీ300ఆర్ బైక్ పైనా 5 వేల రూపాయల డిస్కౌంటు ప్రకటించింది హోండా సంస్థ. ఈ బైక్ ఖరీదు రూ.2.42 లక్షలు. 

 

​సుజుకీ జిక్సెర్ ఎస్ఎఫ్ 250..

 

సుజుకీ సంస్థ తన జిక్సెర్ మోటార్ సైకిల్ పై దాదాపు 20 వేల రూపాయలు డిస్కౌంటు ఇచ్చింది. ఈ బైక్ ధర రూ.1.71 లక్షలు. 

 

​హీరో..

 

హీరో మోటో కార్ప్ తన ఎక్స్ పల్స్ 200 మోటార్ సైకిల్ పై 5 వేల రూపాయ క్యాష్ డిస్కౌంటు ఇస్తుంది. 

 

​బజాజ్..

 

బజాజ్ సంస్థ తన ఆర్ఎస్ 200 స్కూటర్ పైనా 18వేల రూపాయల వరకు డిస్కౌంట్ ప్రకటించింది. 

 

​కవాసాకీ..

 

కవాసాకీ తన నింజా 650 మోటార్ సైకిల్ పై దాదాపు 65 వేల రూపాయల డిస్కౌంటు ప్రకటించింది. ఈ బైక్ ధర రూ.10.29 లక్షలు.

మరింత సమాచారం తెలుసుకోండి: