కరోనా వైరస్ ప్రపంచాన్ని ఎంతలా వణికిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. రోజు రోజుకు ఈ మరణాలు పెరగటంతో ప్రస్తుతం ప్రపంచమంతా హైఅలెర్ట్ గా ఉంటుంది. ఇప్పటికే అన్ని పరిశ్రమలు మూతపడ్డాయి. కరోనా ఎఫెక్ట్ తో మొత్తం అంత సైలెంట్ అయిపోయింది.. ఇంకా ఈ నేపథ్యంలోనే కరోనా కారణంగా ఆటో పరిశ్రమకు ఎంత ఎఫెక్ట్ అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి. 

 

కరోనా వైరస్ కారణంగా ఆటోపరిశ్రమ రోజుకు రూ.13,000 నుంచి 15,000 కోట్ల రెవిన్యూ నష్టపోతుంది. ఇప్పటికే హ్యుండాయ్, హోండా సుజుకీ, టీవీఎస్, టాటా మోటార్స్ కియా మోటార్స్ కూడా వాహన సంస్థలు మరో 10 రోజులు పాటు తమ సంస్దలను తాత్కాలికంగా నిలిపివేశాయి. బీఎండబ్ల్యూ ఇండియాకూడా ఉత్పత్తిని నిలిపి వేయనుంది. 

 

ఇక ఆటో నివేదిక ప్రకారం ఆటో రంగంలో రెవెన్యు రోజుకు రూ.2వేల కోట్లను ఆర్జిస్తుంది. ప్రస్తుతం కరోనా వైరస్ వల్ల ఉత్పత్తిని నిలిపివేయడంతో రోజుకు రూ.15 వేల కోట్ల రూపాయల రెవిన్యూ నష్టం జరుగుతుందని సమాచారం. ఆటోపరిశ్రమ వార్షికంగా రూ.7.8 లక్షల కోట్ల రూపాయల బిజినెస్ చెస్తోంది. ఏది ఏమైనా ఆటో పరిశ్రమపై కరోనా ఎఫెక్ట్ భారీగానే పడింది.

మరింత సమాచారం తెలుసుకోండి: