వాహనదారులకి హీరో మోటో కార్ప్ గుడ్ న్యూస్ తెలిపింది. బీఎస్ -4 వాహనాల  అమ్మకాల  విషయంలో కేంద్రం ఇచ్చిన వెసులు బాటుకి అనుగుణంగా ఆయా కంపెనీలు ఇప్పుడు తమ వాహనాలపై భారీ డిస్కౌంట్ లు ప్రకటించాయి. దాంతో ఇప్పుడు బీఎస్ -4   వాహనాల కొనుగోలుకి వాహనదారులు సిద్దమయ్యారు. వాస్తవానికి గత నెల మార్చి 31 తేదీతోనే ఈ నిషేధం అమలు లోకి రావాల్సి ఉండగా  పలు సంస్థలు కరోనా వ్యాప్తి నేపధ్యంలో కోర్టుని ఆశ్రయించాయి. దాంతో 

IHG

సుప్రీంకోర్టు ఏప్రియల్ 24వరకూ వాహనాలని అమ్ముకోవచ్చని ఆదేశాలు జారీ చేయడంతో  ఇప్పుడు ద్విచక్ర వాహన కంపెనీలు భారీ ఆఫర్లతో వాహనదారులని ఆకర్షిస్తున్నాయి. ఈ నేపధ్యంలోనే హీరో మోటో కార్ప్ కస్టమర్స్ ని ఆకర్షించే పనిలో భాగంగా తమ బీఎస్ -4  వాహనాలపై కళ్ళు చెదిరే ఆఫర్స్ ని ప్రకటించింది. ఒక్కో బీఎస్ -4   వాహనంపై రూ. 10 వేల నుంచీ రూ.15 వేల వరకూ డిస్కౌంట్ లు ప్రకటించింది. 

IHG

ప్రస్తుతం లాక్ డౌన్ నేపధ్యంలో వీలైనంత త్వరగా గడువు ముగిసేలోగా తమ వాహనాలని అమ్ముకోవాలని కంపెనీలు అన్నీ సిద్దమైనట్టుగా తెలుస్తోంది. కేవలం ఒక్క హీరో మోటార్ సంస్థ దాదాపు రూ.600 కోట్ల విలువైన 1.5 లక్షల బీఎస్ -4   వాహనాలు ఉన్నట్టుగా ప్రకటించింది. కాగా దేశ వ్యాప్తంగా అన్ని కంపెనీల డీలర్ల వద్ద 7 లక్షలకి పైగా ద్విచక్ర వాహనాలు ఉన్నట్టు తెలుస్తోంది. త్వరలో మరిన్ని కంపెనీలు తమ బీఎస్ -4   వాహనాలపై డిస్కౌంట్ లు ప్రకటిస్తాయని అంటున్నారు నిపుణులు..

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: