కరోనా వైరస్ అన్నింటిపై ఎఫెక్ట్ పడినప్పటికీ మర్చి నెలలో విడుదల చెయ్యాలి అని అనుకున్న బైక్స్ అన్ని కూడా ముందుగానే విడుదల అయ్యాయి.. ప్రస్తుతం ఆటో సంస్దపై ఎఫెక్ట్ పడినప్పటికీ మర్చి నెల మొదటి 2 వారాల్లో విడుదల అవ్వాల్సిన బైక్స్ అన్ని విడుదల అయ్యాయి. అయితే మర్చి నెలలో విడుదలైన సూపర్ డూపర్ బీఎస్ 6 బైక్స్ ఏంటి అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి. 

 

​బజాజ్ డోమినార్ 250..

 

బజాజ్ డోమినార్ 250 మోటార్ సైకిల్ మర్చి మొదటి వారంలో లాంచ్ అయ్యింది. అయితే ఈ బైక్ ప్రారంభ ధర రూ.1.60 లక్షలుగా నిర్ణయించారు. కేవలం 10.5 సెకండ్లలోనే 0 నుండి 100 కిలోమీటర్ల వేగంలో వెళ్లగలదు.. ఈ బైక్ పెట్రోల్ ట్యాంకు సామర్థ్యం 13.5 లీటర్లు ఉంది.

 

​హోండా సీఆర్ఎఫ్ 1100 ఎల్ ఆఫ్రికా ట్విన్ అడ్వెంచర్ బైక్..

 

హోండా ఆఫ్రికా ట్విన్ సీఆర్ఎఫ్ 1100 ఎల్ బైక్ ప్రారంభ ధర రూ.15.35 లక్షలుగా నిర్ణయించారు. ఈ బైక్ రెండు వేరియంట్లలలో లభ్యం కానుంది. 

 

​జావా, జావా 42 బైక్స్..

 

​జావా, జావా 42 బైక్స్ మర్చి నెల మొదటి వారంలో బీఎస్6 ఫార్మాట్లోకి అప్ డేట్ భారత్ మార్కెట్ లో అయ్యి విడుదల అయ్యాయి. ఇంకా జావా బైక్ ప్రారంభ ధర రూ.1.73 లక్షలుగా నిర్ణయించారు. జావా 42 బైక్స్ ధర రూ. 1.73 లక్షలగా నిర్ణయించారు. 

 

బీఎస్6 సుజుకీ జిక్సెర్..

 

బీఎస్6 సుజుకీ జిక్సెర్ మోటార్ సైకిల్ మర్చి నెల మొదటి వారంలో విడుదల చేశారు.. ఈ బైక్ ప్రారంభ ధర రూ.1,11,871లుగా సుజుకీ సంస్థ నిర్ణయించింది.

 

​సుజుకీ ఇంట్రూడర్..

 

బీఎస్6 సుజుకీ ఇంట్రూడర్ బైక్ ను మర్చి నెల రెండో వారం విడుదల చేశారు. ఈ బైక్ ప్రారంభ ధర రూ.1.2 లక్షలుగా నిర్ణయించారు.

 

​బీఎస్6 టీవీఎస్ ఎక్స్ఎల్ 100..

 

పెద్దవారు.. చిన్నవారు.. రైతులు.. ఆడవారు అని లేకుండా ప్రతి ఒక్కరికి ఉపయోగపడే టీవీఎస్ ఎక్స్ఎల్ బీఎస్6 ఫార్మాట్లోకి అప్ డేట్ చేసి భారత మార్కెట్లో విడుదల చేశారు. ఈ టీవీఎస్ ఎక్స్ఎల్ 100 ప్రారంభ ధర రూ. 43,889లుగా ఆ సంస్ద నిర్ణయించింది. 

 

​రాయల్ ఎన్ ఫీల్డ్ బుల్లెట్ 350..

 

బైక్ కూడా మర్చి నెల కరెక్ట్ గా లాక్ డౌన్ విధించబోయే నాలుగు రోజుల ముందు విడుదల చేశారు. ఎక్స్ షోరూంలోనే ఈ రాయల్ ఎన్ ఫీల్డ్ బుల్లెట్ 350 మోటార్ సైకిల్ ధర రూ.1,27,750లుగా నిర్ణయించారు. 

 

ఇవేనండి.. లాక్ డౌన్ కు ముందు మన భారత్ లో విడుదలైన సూపర్ డూపర్ బైకులు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: