బైక్ ? ఎందుకు కనిపించదు అని అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్న.. ప్రస్తుతం వస్తున్న వాహనాలు అన్ని కూడా బీఎస్6 కాలుష్య నియంత్రణ ప్రమాణాలకు అనుగుణంగా వస్తున్నాయి. అయితే ఇప్పటికే అన్ని ఆటో సంస్ధలు తన వాహనాలను బీఎస్6 ఫార్మట్ లోకి మార్చుకుంటున్నాయి. 

 

ఇంకా ఈ నేపథ్యంలోనే బజజ్ సంస్థ తన పల్సర్ మోడళ్లన్నింటినీ బీఎస్6 ఫార్మాట్లో అప్డేట్ చేసి భారత మార్కెట్లో లాంచ్ చేశాయి కూడా. అయితే తన కమ్యూటర్ మోటార్ సైకిళ్లలో అత్యంత విజయవంతమైన సూపర్ డూపర్ బజాజ్ డిస్కవర్ మోడల్ ను మాత్రం బీఎస్4తోనే నిలిపివేయాలని నిర్ణయించుకుంది ఆ సంస్ద. 

 

డిస్కవర్ 125, 110 సీసీ బైక్స్ ను బీఎస్4 తోనే ఆ సంస్థ ఆపివేయనుందీ. బజాజ్ కంపెనీకి చెందిన అత్యంత పాత మోడల్ అయినా ఈ వాహనం గత 16ఏళ్లుగా దేశవ్యాప్తంగా అత్యంత విజయవంతమవడమే కాకుండా మంచి విక్రయాలు అందుకుంది. అలాంటి ఈ బైక్ ను గ్రామీణ ప్రాంతాల్లో రైతులు ఈ వాహనాన్ని ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఇంకా ఈ బైక్ ధర కూడా తక్కువ ఉండటం కారణంగా ఎక్కువ మంది ఈ బైక్ ను కొన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: