ఎలక్ట్రిక్‌ కార్స్... ప్రస్తుతం ఎక్కడ చూసిన దేశంలో, ప్రపంచంలో ప్రతి చోట ఎలక్ట్రిక్‌ కార్లకు విపరీతమైన ఆదరణ రోజురోజుకి ఎక్కువ అవుతుంది. మాములుగా ఉపయోగించే కార్బన్‌ ఉద్గారాలను విడుదల చేసే పెట్రోల్‌, డిజిల్‌ కార్ల కన్నా... కాలుష్యానికి హాని కలిగించని ఎలక్ట్రిక్‌ కార్ల వైపు ఇప్పుడు ప్రజలు మొగ్గు చూపిస్తున్నారు. ముఖ్యంగా ఈ విషయాన్నీ దృష్టిలో పెట్టుకొని మోటారు రేసింగ్‌ ఔత్సాహికుల కోసం కంపెనీలు సరికొత్త మోడళ్లను ముందుకు తీసుక రాబోతున్నాయి. 

 

 


ఇందులో భాగంగానే ఏకంగా గంటకు 305 కిలోమీటర్ల వాయు వేగంతో ప్రయాణించే AP-1 అనే ఎలక్ట్రిక్‌ సూపర్‌ కారును అపెక్స్‌ మోటార్స్‌ ఇంకో వారం రోజుల్లో ఆవిష్కరించబోతుంది అని సుసంచారం. హాంకాంగ్‌ దేశానికి చెందిన ఇద్దరు సోదరులు ఈ సూపర్‌ కారును రూపకల్పన చేశారని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. ap -1 సూపర్‌ కారు 620 కేజీల బరువు, కార్బన్‌ ఫైబర్‌ తో కూడిన అత్యుధునిక డిజైన్‌ లతో రూపుదిద్దుకున్నట్లు  తెలుస్తోంది. 

 

 


అయితే ఈ కార్ కొండ ప్రాంతాలలో కూడా ap - 1 కారు వేగంతో ప్రయాణిస్తుందని ఆవిష్కర్తలు రుజువు చేస్తున్నాయి. అప్ - 1 ఎలక్ట్రిక్‌ కారు పూర్తి చార్జింగ్‌ తో ఏకంగా 515 కిలోమీటర్ల వరకు  ప్రయాణించగలదని, అయితే ఇందులోఇంకో చెప్పాల్సిన విషయం ఫాస్ట్‌ చార్జర్‌ తో కేవలం 20 నిముషాల్లో 80 % చార్జింగ్‌ అవుతుందని కంపెనీ సూచించింది. కస్టమర్ దేవుళ్ళ అభిరుచులకు అనుగుణంగానే ఎలక్ట్రిక్‌ కారు రూపకల్పన చేశామని సదరు కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. ఏది ఏమైనా ఎలక్ట్రిక్‌ కార్స్ పర్యావరణానికి ఎలాంటి అపాయం చేయదని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: