ఒక పక్క కరోనా మరొక వైపు ఆర్ధిక మాంద్యం. ఈ పరిస్థితులలో అనేక కంపెనీ లు వారివారి కార్యకలాపాల్ని నిలిపేశారు. ఇంకా నిజానికి కొన్ని కంపినీలు తిరిగి మళ్లీ వాటి ఉత్పత్తిని ప్రారంభిస్తాయో లేదో అర్ధం కానీ పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితులలో సదరు కంపెనీ కస్టమర్లకు కావలిసిన వాటిని అన్నిటిని అందించలేకపోయిన కొద్దికొద్దిగా సమకూర్చుతున్నాయి.

 

 
అయితే ఇప్పుడు కరోనా వైరస్ ప్రభావం కారణంగా హీరో మోటోకార్ప్ కీలక నిర్ణయం తెలిపింది. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ లాక్‌ డౌన్ ఉన్నందున తమ బైకులు కొన్న కస్టమర్లకు వారెంటీ, ఫ్రీ సర్వీస్, AMC సర్వీస్ గడువు తేదీలని పొడిగించింది. దీనితో ఆ కంపెనీ మార్చి 21 నుంచి ఏప్రిల్ 30 మధ్య ఫ్రీ సర్వీస్ ముగిసే వారి అందరి కోసం ఆ  గడువును 2020 జూన్ 30 వరకు కొనసాగిస్తున్నట్టు తెలిపింది. దింతో మార్చి నెల 21 నుంచి ఏప్రిల్ నెల 30 మధ్య కాలంలో హీరో బైకులపై ఫ్రీ సర్వీస్ లేదా వారెంటీ ముగిసినా వాహనదారులు జూన్ 30 వరకు ఉపయోగించవచ్చు. ఇక లాక్‌ డౌన్ కారణంగా సేవలు అందించలేని పరిస్థితి ఉండడంతో హీరో మోటోకార్ప్ ఈ నిర్ణయాన్ని తీసుకుంది. ఈ ఆఫర్ హీరో బైకులు, స్కూటర్లకు అన్నిటికి ఇది వర్తించనుంది.

 


ఇకపోతే స్థానిక అధికారుల యంత్రాంగం అనుమతి ఇచ్చిన కూడళ్లలో రోడ్ సైడ్ అసిస్టెన్స్ ఇస్తున్నట్టు హీరో మోటోకార్ప్ తెలిపింది. అంతేకాకుండా కస్టమర్స్ కి సేల్స్, ఆఫ్టర్ సేల్స్, సర్వీస్, వారెంటీ లాంటి సందేహాలు ఉన్నవారు కంపెనీ యొక్క 24 గంటలు పనిచేసే టోల్‌ ఫ్రీ నెంబర్ 18002660018 కు కాల్ చేసి సమాచారం తెలుసుకోవచ్చు అని వారు తెలిపారు. ఏది ఏమైనా కంపెనీ వారు వారి కస్టమర్ దేవుళ్లకు సహాయం చేయడానికి వివిధ మార్గాలు ఎప్పటికప్పుడు ఎతుకుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: