కరోనా వైరస్ దెబ్బకి ఈ ఆర్థిక సంవత్సరంలో భారత్ లో ద్విచక్ర వాహనాల అమ్మకాలు భారీగా తగ్గేపోయే అవకాశం ఉంది. కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా భారత ప్రభుత్వం 21 రోజుల లాక్ డౌన్ అమలు చేసింది. ఈ లాక్ డౌన్ ప్రకటన కారణంతో చాలా మంది డీలర్లు షోరూమ్‌ లను పూర్తిగా మూసివేయడం జరిగింది. కోవిడ్ -19 అధికంగా వ్యాపిస్తున్న కారణంగా ఆటోమొబైల్ కంపెనీ షోరూమ్‌ లను పూర్తిగా మూసివేశారు. అలాగే  "ది ఎకనామిక్ టైమ్స్" వారి నివేదిక ప్రకారం 2021 ఆర్థిక సంవత్సరంలో భారతదేశం యొక్క ద్విచక్ర వాహనాల అమ్మకాలు పడిపోయాయని. ఇది 11% - 13% కి పడిపోతుందని వారి అంచనా. అయితే ప్రస్తుతం మాత్రం 20 - 21 లక్షల యూనిట్లకు ఇది పడిపోయింది. లాక్ డౌన్ అమలుతో ప్రస్తుతం చాలా కంపెనీలు తమ అమ్మకాలను పూర్తిగా నిలిపివేసాయి.

 


 
అయితే ప్రస్తుత పరిస్థితి గురించి ICRA వైస్ ప్రెసిడెంట్ మాట్లాడుతూ ద్విచక్ర వాహనాల కంపెనీలు ఎక్కువగా నష్టపోతాయని ఆయన చెప్పారు. వీటితోపాటు మిగిలిన BS - 4 వాహనాలను విక్రయించడానికి సంస్థలపై కూడా ఎక్కువ ఒత్తిడి పెరుగుతోందని ఆయన తెలిపారు. 2020 ఆర్థిక సంవత్సరం ద్విచక్ర వాహన ఏ సంస్థకు కూడా మంచిది కాదు, దీనికి కారణం కరోనా లాక్ డౌన్ వల్ల వాహనం ఉత్పత్తులే మాత్రమే కాకుండా BS - 4 వాహనాల అమ్మకాలు కూడా పూర్తిగా తగ్గిపోయాయి. ఈ మధ్య కాలంలో ద్విచక్ర వాహనాల అమ్మకాలు దాదాపు 16% వరకు పడిపోయాయి అంటే నమ్మండి.

 

 


భారత దేశంలో కార్లు మాత్రం ఆన్లైన్‌ లో అమ్మడం జరుగుత ఉంది. అయితే ఇక్కడ చాలా బైక్ కంపెనీలకు ఆన్లైన్‌ లో విక్రయించే సదుపాయం లేదు. దీనితో అమ్మకాల పరిమాణం తక్కువగా ఉండటమే అసలైన  కారణం. ఇండియాలో దిగువ, మధ్య తరగతి ప్రజలు కరోనా వైరస్ సంక్రమణతో చాలా ఇబ్బందులు ఎదురుకుంటున్నారు ప్రస్తుతం. ఈ వర్గానికి చెందిన కస్టమర్లే ఆ ద్విచక్ర వాహనాల ప్రధాన కస్టమర్లు. అయితే ఆర్థిక ఇబ్బందుల కారణంగా ద్విచక్ర వాహన సంస్థలు వారి కస్టమర్లను కోల్పోతున్నాయి. అలాగే అమ్మకాలు మరింత తగ్గే అవకాశం క్లియర్ గా కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: