ప్రస్తుతం హ్యుండాయ్ కంపెనీ కి సంబంధించి ఎక్కువగా అమ్ముడు పోయిన కార్ హ్యుండాయ్ ఎలంత్రా. అయితే కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఇచ్చిన సూచనల మేరకు BS - 6 ప్రమాణాలకు అనుగుణంగా మార్పులు చేసి ఆ కార్ కొత్త స్పెసిఫికేషన్లను కంపెనీ విడుదల చేసింది. 2020 మోడల్ లో డీజిల్ ఇంజన్ వివరాలను మాత్రమే విడుదల చేసింది. అయితే లాక్ డౌన్ సమయం ముగిసిన తర్వాత ఈ కారు యొక్క ధర, లాంచ్ తేదీలను అలాగే పూర్తి వివరాలను తెలుపుతామని కంపెనీ ప్రకటించింది.


ఇక ఈ కార్ ఇంజన్ రెండు వేరియంట్లలో లభించబోతున్నాయి.  SX, SX(O) అనే వేరియంట్లలో దొరుకుతుంది. డీజిల్ ఇంజన్ కలిగి ఉన్న ఈ వాహనం 1.5 Lr యూ - 2 ఇంజిన్ తో 112 BHP బ్రేక్ హార్స్ పవర్, 250 NM టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. అంతేకాకుండా ఇది 6- స్పీడ్ మ్యానువల్, ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ వ్యవస్థతో అద్భుతంగా పనిచేస్తుంది. అయితే అప్డేటెడ్ ఇంజిన్ కాకుండా ఈ వాహనంలో ఎలాంటి మార్పులు చేయట్లేదు హ్యుండాయ్ సంస్థ. 

 


ఈ ప్రీమియమ్ సెడాన్ లో ఫీచర్లకు కొదవే లేదని చెప్పవచ్చు. ఇందులో బ్లూ లింక్ కనెక్టివిటీ టెక్నాలజీతో అందుబాటులోకి వచ్చిన ఈ కారు తర్వాతి తరం ఎలంత్రా మోడల్ గా అందుబాటులోకి రాబోతుంది. అయితే ఇటీవలే ఈ కారును కంపెనీ ఆవిష్కరించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: