హోండా సిటీ ఐదో తరం మోడల్ ను భారత మార్కెట్లోకి మార్చ్ 16 నే విడుదల చేయాల్సి ఉండగా.. ప్రస్తుత కరోనా వైరస్ ప్రభావంతో ఈ వాహనం విడుదలను తాత్కాలికంగా వాయిదా వేశారు కంపెనీ యాజమాన్యం. లాక్ డౌన్ అనంతరం మే నెలలో ఈ సెడాన్ ను లాంచ్ చేయనుంది హోండా సంస్థ. అయితే తాజాగా హోండా సిటీ వాహనంలోని ZX మోడల్ ను ఫొటోలను విడుదల చేసింది కంపెనీ. 

 

 

అయితే ఇంక దీని ప్రత్యేకతలు విషయానికి వస్తే... ఈ 2020 హోండా సిటీ మోడల్లో సరికొత్త LED హెడ్ లైట్లు, LED టెయిల్ లైట్లు, 6 ఎయిర్ బ్యాగులు, ట్రాక్షన్ కంట్రోల్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటి ప్రొగ్రాం, హిల్ హోల్డ్ అసిస్ట్ లాంటి ప్రత్యేకతలు ఇలా చాలా ఇందులో ఉన్నాయి. అంతేకాకుండా ఈ సిటీ ZX వేరియంట్లో ప్రెజర్ మానిటరింగ్ సిస్టం, హోండా సివిక్ లాగా రివర్స్ పార్కింగ్ కెమేరా కూడా ఉంది. అంతే కాకుండా కనెక్టెడ్ కార్ టెక్నాలజీ హోండా కనెక్ట్ ఈ కార్ లో ఉంది.  

 

 

ఇక ఇంజిన్ విషయానికి వస్తే సెమీ డిజిటల్ ఇన్ స్ట్రూమెంట్ క్లస్టర్ ఇందులో ఉంది. ఇందులో 7- అంగుళాల HD ఫుల్ కలర్ మిడ్ అనలాగ్ స్పీడోమీటర్, టాకోమీటర్ లాంటి ప్రత్యేకతలు ఇందులో కలిగి ఉన్నాయి. ఇక అసులది ధర .. ఎక్స్ షోరూంలో ఈ 2020 హోండా సిటీ మోడల్ ధర రూ.10 లక్షల నుండి మొదలై రూ.15 లక్షల వరకు మధ్య ఉండే అవకాశముంది. అయితే ఈ వాహనం లాంచ్ అయిన తర్వాత ఇండియాలో ఈ కారుకు పోటీగా వోక్స్ వాగెన్ వెంటో, టొయోటా యారిస్, స్కోడా ర్యాపిడ్ లాంటి కార్లు ఉండబోతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: