కొంతమంది హీరోయిన్స్ కథలను ఎలా ఎంపిక చేసుకుంటారో.. పర్సనల్ లైఫ్ లో అలానే ఓ మంచి టేస్ట్ తో ముందుకు వెళ్తుంటారు.. ఎన్నో అద్భుతమైన సినిమాలు తీసి.. అద్భుత నటులుగా పేరు పొందిన తారలు అందరూ కూడా ఎంతో అద్భుతమైన బైకులు, కార్లు సొంతం చేసుకుంటుంటారు. ఇంకా ఈ నేపథ్యంలోనే మన మాజీ హీరోయిన్స్ మతిపోగోట్టే కార్లను కొని షికారు చేస్తున్నారు. ఆ కార్లు ఏంటి అనేది ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం. 

 

​కరిష్మా కపూర్..

 

ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఎందుకంటే ఈమె ఓ మంచి నటి.. 1990 నుండి 2000 మధ్యకారంలో బాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ కపూర్ ఫ్యామిలీ నుండి అడుగుపెట్టింది. ఇంకా ఈ భామ ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ కార్ల కొనుగోలులో మాత్రం ముందుంది.. కరిష్మా కపూర్ ల్యాండ్ రోవర్ ఫ్రీ ల్యాండ్ రోవర్ 2 ఎస్ యూవీని కొనుగోలు చేసారు. 

 

​జూహీ చావ్లా..

 

ఈమె కూడా 1990 కాలం నటి ఏ.. అప్పట్లో ఓ వెలుగు వెలిగిన ఈ నటి మంచి మంచి సినిమాల్లో నటించి ఫిలిం ఫెర్ సొంతం చేసుకుంది. అంతేకాదు ఈమె మిస్ ఇండియా విజేత కూడా.. ఈ భామ ఇప్పుడు పోర్షే కేయాన్నే వాహనాన్ని వాడుతూ కొన్ని కొన్ని కార్యక్రమాలకు హాజరవుతుంటుంది. అయితే ఈ భామతో జాగ్వర్ ఎక్స్ జేఎల్ మోడల్ కూడా ఉంది.

శిల్పా శెట్టి..

 

వయసు ఎంత ఉన్న ఇప్పటికి పాతికేళ్ల సుందరిలానే ఉంటుంది.. అలా మైంటైన్ చేస్తుంది ఈ భామ. ఇంకా సోషల్ మీడియాలో ఎపుడు యాక్టీవ్ గా ఉండే శిల్ప శెట్టి వద్ద బీఎండబ్ల్యూ ఐ8, బీఎండబ్ల్యూ 7 సిరీస్, బెంట్లీ ఫ్లయింగ్ స్పర్, రేంజ్ రోవర్ స్పోర్ట్ లగ్జరీ కార్లు అన్ని ఉన్నాయ్. 

 

​కాజోల్..

 

ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అనుకుంట.. బాలీవుడ్ లోనే కాదు.. టాలీవుడ్ లోను తన సత్తా ఏంటో చూపించింది ఈ నటి.. ఇంకా ఈ నటి బాలీవుడ్ హీరో అజయ్ దేవ్ గణ్ ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.. అలనాటి ఈ ముద్దుగుమ్మ వోల్వో ఎక్సీ 90 కారును సొంతం చేసుకుంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: