అతివేగం ప్రమాదం అని అందరికీ తెలిసిన విషయమే... అయితే కొందరు ఆలస్యం అమృతం విషం అని కూడా కొంతమంది భావిస్తారు. అయితే ప్రస్తుత జనరేషన్ కాలంలో కార్ల విషయానికొస్తే ఎక్కువ స్పీడ్ వెళ్లే కార్లకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రస్తుతం ఆటోమొబైల్ రంగంలో స్టైల్ తో పాటు వేగాన్ని కూడా ప్రాధాన్యత ఇస్తున్నారు అంటే పరిస్థితి ఎంత ఉందో ఇట్లాగే అర్థం చేసుకోవచ్చు. అయితే ఇక అసలు విషయానికి వస్తే...

 

ప్రపంచంలోనే అత్యధిక వేగంగా వెళ్లే కారు వచ్చి ఇప్పటికి 15 సంవత్సరాలు అయ్యింది. ఇంతకీ ఆ కారు ఏంటి అనే కదా మీ అనుమానం. ఇక కారు విషయానికి వస్తే వరల్డ్ ఫాస్టెస్ట్ కార్ గా గుర్తింపు తెచ్చుకున్న బుగాటి వేరాన్. ఇది 2005వ సంవత్సరంలో చట్టపరంగా రోడ్డుపై అత్యధిక వేగంగా వెళ్లిన కారుగా ఈ వాహనం గుర్తింపు వచ్చింది. ఈ కారు ఏకంగా గంటకు 406.4 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది.


ఇక ఈ కార్ ఇంజన్ విషయానికి వస్తే 1000 BHP బ్రేక్ హార్స్ పవర్ కంటే ఎక్కువగా ఉండే వాహనాన్ని రూపొందించాలని 2000 సంవత్సరంలోనే ఆ కంపెనీ వారు అనుకున్నారు. అయితే ఆ తరువాత సంవత్సరంలో ఈ కారుని థౌసండ్ BHP, 1250 nm టార్క్ ను ఉత్పత్తి చేసే విధంగా తయారు చేసే సెవెన్ స్పీడ్ DSG గేర్ బాక్స్ వ్యవస్థతో కూడిన ఈ కారుని మార్కెట్లో రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఈ కారు విశేషం ఏమిటంటే కేవలం 2.5 సెకన్లలోనే 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని ఈ కారు అందుకోగలదు. అయితే ఈ కారు కేవలం వేగం మాత్రమే కాకుండా అత్యాధునిక ఫీచర్లు ఇందులో పొందుపరిచారు. 16 సిలిండర్ల ఇంజన్ అమర్చి 986 హార్స్ పవర్ హై కూలింగ్ సిస్టం, 60 లీటర్ల సామర్థ్యం కలిగిన కూలెంట్ ను కూడా ఇది కలిగి ఉంది ఈ కార్.

మరింత సమాచారం తెలుసుకోండి: