ప్రస్తుతం కరోనా వైరస్ ప్రపంచం అన్ని దేశాలను వణికిస్తుంది అని చెప్పవచ్చు. ఇక దీని ప్రభావంతో ఇప్పటికే కరోనా కేసుల సంఖ్య ప్రపంచం మొత్తంగా 23 లక్షలకు చేరింది. ఇక మనదేశం విషయానికి వస్తే ఇప్పటికే అనేక వ్యాపార వాణిజ్యాలు దెబ్బ తిన్నాయి. ఇక భారత్ ఆటో పరిశ్రమ తీవ్ర నష్టాలను ఎదుర్కుంటోంది. ఇక ఈ నేపథ్యంలో రాయల్ ఎన్ ఫీల్డ్ సంస్థ తన సరికొత్త మీటియర్ ఫైర్ బాల్ మోటార్ సైకిల్ ను తీసుక వస్తోంది. ఇక త్వరలో విడుదల కానున్న ఈ బైక్ ఫోటోలను విడుదల చేసింది కంపెనీ. 350 cc సిగ్మెంట్లోని రాయల్ ఎన్ ఫీల్డ్ థండర్ బర్డ్ 350 X స్థానంలో ఈ మీటియర్ ఫైర్ బాల్ బైక్ ను తీసుకరాబోతున్నారు కంపెనీ వారు.

IHG


అయితే ఈ బైక్ ధర విషయానికి వస్తే... రాయల్ ఎన్ ఫీల్డ్ మీటియర్ పైర్ బాల్ ధర వచ్చేసి రూ.1,68,550 లుగా ఉండబోతున్నట్లు సమాచారం. కాకపోతే ఇది ఇంకా అధికారిక ప్రకటన కాలేదు. అయితే ఈ బైక్ బరువు తక్కువగా ఉండి దీని కంటే ముందు మోడల్ తో పోలిస్తే మరింత పవర్ ఫుల్ గా పని చేస్తుంది. దీనితో ముఖ్యంగా దూర ప్రయాణాలు చేసేవాళ్లకు బాగా సరిపోతుంది ఈ బైక్.

 

IHG

ఇక ఈ బైక్ 346 cc ఎయిర్ కూల్డ్ సింగిల్ సిలీండర్ ఇంజిన్ ను ఉండడంతో పాటు, ఇది 19.8 BHP బ్రేక్ హార్స్ పవర్, 28 nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇక అంతేకాకుండా ఇది 5 - స్పీడ్ మ్యానువల్ ట్రాన్స్ మిషన్ వ్యవస్థతో ఈ బైక్ పనిచేస్తుంది. ఇక భారత విపణిలో ఈ వాహనానికి పోటీగా జావా ఫార్టీ, బెనెల్లి ఇంఫీరియల్ 400  మోటార్ సైకిళ్లు ఆల్రెడీ మార్కెట్ లో ఉన్నాయి. ఇక ఈ సరికొత్త మోటార్ బైక్ విషయానికి వస్తే రాయల్ ఎన్ ఫీల్డ్ 350 మీటియర్ ఫైర్ బాల్ లేటెస్ట్ అప్డేట్లతో ఇది మన ముందుకు రానుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: