ప్రస్తుతం భారతదేశంలో యువత స్పోర్ట్స్ బైక్ పై ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. అంతేకాదు రాయల్ ఎన్ ఫీల్ల్డ్ కు సంబంధించిన మోటార్ సైకిల్స్ కొనడంలో కూడా చాలా ఇష్టపడుతున్నారు. మార్కెట్లో మోటార్ సైకిల్ డిమాండ్ పెరిగే కొద్దీ వాహన తయారీ కంపెనీలు కూడా ఇటువంటి మోటార్ సైకిల్స్ తయారు చేయడానికి మొగ్గు చూపుతాయి అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అయితే నేటి యువత బైక్స్ కోసం ఏకంగా 2 లక్షల వరకు ఖర్చు పెట్టేంత పరిస్థితికి చేరుకున్నారు. అయితే ఇప్పుడు మనము రెండు లక్షల లోపు బి ఎస్ - 6 ప్రమాణాల మేరకు తయారైన కొత్త బైకులు ఒకసారి ఇప్పుడు చూద్దాం.


ఎవరైనా సరే వినియోగదారులు మంచి స్టైల్ గా ఉండే అలాగే అప్డేటెడ్ ఆటో మొబైల్స్ ని ఎక్కువగా ఇష్టపడుతుంటారు. అయితే మార్కెట్లో ప్రస్తుతం రెండు లక్షలకు కింద ఉండే టాప్ 3 బైక్ లను ఒకసారి చూద్దాం.
ఇందులో మొదటగా చెప్పుకునేది KTM 250 DUKE. ఈ ఏడాది ప్రారంభంలో తెచ్చిన BS 6 అప్‌గ్రేడ్ క్వార్టర్ లీటర్ నేకెడ్ స్ట్రీట్ ఫైటర్ ధర రూ. 2.00 లక్షల వరకు ఉంటుంది. అయితే ఈ బైక్ ( కెటిఎం 250 డ్యూక్ )  కు భారత మార్కెట్లో బజాజ్ డామినార్ 250, యమహా ఎఫ్జెడ్ 25, సుజుకి జిక్సెర్ 250 వంటివి ప్రత్యర్థిగా వస్తాయి.


ఇక ఆ తర్వాత చెప్పుకోతగ్గ బైక్  రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 . ప్రస్తుతం భారతీయ మార్కెట్లో అత్యధికంగా అమ్ముడైన రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటారు సైకిల్ ఈ ‌క్లాసిక్ 350. ఇక రాయల్ ఎన్‌ఫీల్డ్ తన 346 cc సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్, ట్విన్స్‌ పార్క్, ఎయిర్ కూల్డ్ ఇంజిన్‌తో 5,250 RPM వద్ద 20 ps శక్తిని, 4,000 RPM వద్ద 28 nm పీక్ టార్క్ ‌ను ఇది ఉత్పత్తి చేస్తుంది. మరి ఆ తర్వాత చెప్పుకొనే విధంగా బజాజ్ డామినార్ 400 ను చెప్పుకోవచ్చు.  తాజాగా బజాజ్ తన బ్రాండ్ నుంచి BS 6 డామినార్ 400 ను దేశంలో రూ. 1.91 లక్షల ప్రారంభ ధరతో విడుదల చేసింది. ఇక ఈ బైక్ ఇంధన ఇంజెక్షన్ టెక్నాలజీతో 373.3 cc సింగిల్ సిలిండర్, లిక్విడ్ - కూల్డ్ ఇంజన్ ఇది కలిగి ఉంటుంది. ఇది 8,800 RPM వద్ద 40 ps శక్తిని, 6,500 RPM వద్ద 35 nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: