ఎవరైనా వాహనాలు కొత్తగా కొనాలనుకునేవారు ఆ వాహనం యొక్క ధర, ఎలాంటి ఇంజన్ కలిగి ఉంది, మైలేజ్ ఎంత ఇస్తుంది ఇలాంటి అంశాలను పూర్తిగా చదివి తెలుసుకున్న తర్వాతనే కొనడానికి ముందడుగు వేస్తారు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇవే కాకుండా మరొక విషయాన్ని కూడా మనం ఆలోచించాల్సి ఉంటుంది. ప్రస్తుత జనరేషన్ లో టెక్నాలజీని వాడకం ఎలా జరుగుతుందో మనం బయట చూస్తూనే ఉంటాం. అయితే ఆటో రంగంలోకి వచ్చేసరికి టూ వీలర్ కంటే ఫోర్ వీలర్ లో టెక్నాలజీని ఎక్కువగా ఉపయోగించే అవకాశం ఉంటుంది. అయితే టూవీలర్ లో కూడా ధర పెట్టే కొద్ది ఫీచర్స్ ను అందిస్తున్నాయి ఆటో దిగ్గజ కంపెనీలు.

 


ఇకపోతే ప్రస్తుతం ద్విచక్ర వాహనాలు కూడా అత్యధిక ప్రత్యేకతలతో మార్కెట్లోకి కొత్త వడులతో సందడి చేస్తున్నాయి. మరీ ముఖ్యంగా బైకు స్మార్ట్ ఫోన్ లో అనుసంధానం చేసుకొని కేవలం చేతివేళ్ళతో ఆపరేట్ చేసే విధంగా టెక్నాలజీని రూపొందిస్తున్నారు. టెక్నాలజీ అంటే ప్రస్తుతం జియో ఫెన్సింగ్, బ్లూటూత్ కనెక్టివిటీ, నేవిగేషన్ లాంటి వాటిని మొబైల్ ఫోన్ కు కనెక్ట్ చేసుకునే అవకాశం మనకు కలదు. అయితే ఇలాంటి ఫీచర్లు ద్విచక్ర వాహనాల్లో ఉన్నయో ఒకసారి మనము చూద్దామా... !

 

ప్రస్తుతం భారత మర్కెట్స్ లో ​టీవీఎస్ ఎన్ టార్క్, హీరో ఎక్స్ పల్స్ 200, ఏథర్ 450, టీవీఎస్ అపాచీ ఆర్ఆర్ 310, బీఎండబ్ల్యూ ఎఫ్750 GS ఈ వాహనాలు అనేక ఫీచర్స్ ను కలిగి ఉన్నాయి. టీవీఎస్ ఎన్ టార్క్ మార్కెట్ లో మోడల్ ప్రారంభ ధర రూ.65,975. గరిష్ఠంగా దీని ధర వచ్చేసి రూ.72,455లుగా ఉండగా, ​హీరో ఎక్స్ పల్స్ 200 BS - 4 మోడల్ ధర వచ్చేసి రూ.1.07 లక్షలు ఉండగా కార్పురేటెడ్ ఇంజిన్ ధర వచ్చేసి 99,500 రూపాయలుగా నిర్దేశించింది కంపెనీ. ఇక BS 6 ధర 10 వేల రూపాయల వరకు పెంచింది. ఏథర్ 450 ఈ సరికొత్త విద్యుత్ స్కూటర్ ప్రారంభ ధర రూ.85,000 లుగా సంస్థ తెలిపింది. బీఎండబ్ల్యూ ఎఫ్750 GS ఈ మోటార్ సైకిల్ ప్రారంభ ధర వచ్చేసి రూ.11.95 లక్షలుగా బీఎండబ్ల్యూ నిర్ణయించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: