వెస్పా స్కూటర్లు BS6 మోడళ్ళు ఎట్టకేలకు భారత మార్కెట్లో విడుదల చేసింది. ఇదివరకే మార్కెట్లో రావాల్సి ఉండగా, కరోనా వైరస్ దెబ్బతో లాంచ్ ను వాయిదా వేసింది కంపెనీ. అయితే తాజాగా భారత మార్కెట్ లోకి వీటిని విడుదల చేసింది. ఈ స్కూటర్ BS6 వెస్పా స్కూటర్ ప్రారంభ ధర వచ్చేసి రూ.93,035 గా సంస్థ నిర్దేశించింది. అయితే వివిధ వేరియంట్లలో లభ్యమవుతున్న ఈ స్కూటర్లు వేరియంట్ల వారీగా ధరలో కొద్ది తేడాలున్నాయి. ఇందులో ముఖ్యంగా 125 cc, 149 cc రేంజ్ స్కూటర్లను భారత మార్కెట్ లో విడుదల చేసింది ఈ సంస్థ. ఇక వీటి రేట్ల విషయానికి వస్తే వెస్పా 125 అర్బన్ క్లబ్  రూ.93,035 , వెస్పా ఎల్ఎక్స్ రూ.96,615 , వెస్పా జెడ్ఎక్స్  రూ.1,00,687 , వెస్పా 125 వీఎక్స్ఎల్ రూ.1,10,345, వెస్పా 125 ఎస్ఎక్స్ఎల్ రూ.1,13,592, వెస్పా 149 వీఎక్స్ఎల్  రూ.1,22,664, వెస్పా 149 ఎస్ఎక్స్ఎల్ రూ.1,26,650 గా కంపెనీ నిర్ణయించింది.

 


అలాగే ఇక ఇంజిన్ చూస్తే ... ఈ కంపెనీ 150 cc ఇంజిన్ల స్థానంలో 149 cc ఇంజిన్ సామర్థ్యాన్ని ఇవి ఉన్నాయి. ఇక ఈ ఇంజిన్ 10 BHP బ్రేక్ హార్స్ పవర్, 10.6 nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇక వెస్పా 125సీసీ ఇంజిన్ అయితే 9.7 BHP బ్రేక్ హార్స్ పవర్, 9.6 nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. దీనితో రెండు ఇంజిన్లు ఫ్యూయల్ ఇంజెక్టెడ్ టెక్నాలజీ అందుబాటులోకి తీసుక వచ్చింది కంపెనీ.

 


ఇంకా ఈ స్కూటర్ ఫీచర్లు చూస్తే ... ఇందులో గుండ్రని ఆకారంలో ఉన్న హెడ్ లైట్, ఇన్ స్ట్రూమెంట్ క్లస్టర్ ను కలిగి ఉండి మంచి ఆకర్షణీయవంతంగా కనిపిస్తుంది. ఇక వెస్పా 125 SXL (టాప్ స్పెక్) మోడల్ అయితే దీర్ఘ చతురాస్రాకారపు హెడ్ లైటు LED హెడ్ ల్యాంపు, డిజిటల్ ఇన్ స్ట్రూమెంట్ క్లస్టర్ లాంటి ఫీచర్లు కూడా అందులో ఉన్నాయి.  అంతేకాకుండా ప్రతి వేరియంట్లో వివిధ వెరైటీలు కలిగి ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: