బీఎండబ్ల్యూ.. ఇది మన సామాన్యులు పేరు వినడమే తప్ప తాకడం కూడా కష్టమే.. అలాంటి విలాసవంతమైన కారు.. కేవలం అంటే కేవలం.. డబ్బు ఉండి కొట్టుకునే వారికే ఈ సొంతం అని ప్రజలు అంత అభిప్రాయం వ్యక్తం చేస్తుంటారు.. నిజమే లెండి.. బీఎండబ్ల్యూ మన భారత్ మార్కెట్ లో అత్యంత విలాసవంతమైన వాహనాల తయారీ సంస్దగా గుర్తింపు పొందింది.. 

 

ఇకపోతే జర్మన్ ఆటో సంస్థ నుండి బీఎండబ్ల్యూ 8-సిరీస్ గ్రాన్ కూపే, ఎం8 కూపే మోడల్ లాంచ్ అయ్యింది. అయితే ఈ సరికొత్త బీఎండబ్ల్యూ 8-సిరీస్ గ్రాన్ కూపే రెండు వేరియంట్లలో వినియోగదారులకు లభించనుంది... అదే ఒకటి 840ఐ గ్రాన్ కూపే, రెండోది 840ఐ గ్రాన్ కూపే ఎం స్పోర్ట్ ఎడిషన్లను భారత మార్కెట్లోకి విడుదల చేసిందీ బీఎండబ్ల్యూ వాహనం సంస్థ. 

 

ఇకపోతే ఈ కార్ల ప్రారంభ ధర ఎక్స్ షోరూంలో రూ.1.30 కోట్లుగా నిర్ణయించారు.. అయితే బీఎండబ్ల్యూ వేరియంట్ల ధర ఇలా కొనసాగుతుంది.. అయిన కార్ ప్రారంభ ధరే 1. 30 కోట్ల ధర ఉంది అంటే.. మిగితా వాహనల ధర ఎంత ఉండాలి.. ఇంకా ఇప్పుడు కార్ల ధర చూస్తే.. బీఎండబ్ల్యూ 840ఐ గ్రాన్ కూపే ధర రూ.1.30 కోట్లు. 

 

840ఐ గ్రాన్ కూపే ఎం స్పోర్ట్ ఎడిషన్ ధర రూ.1.55 కోట్లు. ఎం8 కూపే వేరియంట్ ధర రూ.2.15 కోట్లుగా నిర్ణయించారు.. ఇన్ని కోట్లు పెట్టాకా ఈ కారు ప్రత్యేకతలు బాగుండవా అంటే బాగుంటాయి.. అలానే ఇంజిన్ కూడా బాగుంటుంది.. ఇక పోతే ఈ కారు గంటకు 250 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది.. చూశారుగా.. కారు కొనడానికి ఈ ఒక్క ప్రత్యేకత చాలు కుర్రాళ్లకు..                            

మరింత సమాచారం తెలుసుకోండి: