స్పోర్ట్స్ బైక్ మోటార్ సైకిల్ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చేసింది. ఈ బైకులకు బాగా పేరు పొందిన కవాసాకి తన కంపెనీ నుండి కొత్తగా నింజా 650 మోటార్ సైకిల్ భారత విపణిలోకి వదిలింది. అయితే ఈ బైక్ ను కొత్తగా కాలుష్య నియంత్రణ ప్రమాణాలకు అనుగుణంగా Bs 6 గా అభివృద్ధి చేసి భారత్ లో విడుదల చేసింది. ఇక ఈ బైక్ లో సరికొత్త కాస్మోటిక్ మార్పులతో మోటార్ సైకిల్ రిలీజ్ అయింది.

 


ఇక ఈ బైక్ ప్రత్యేకతలు విషయానికి వస్తే....  మంచి స్టైలిష్ లుక్ తో మన ముందుకు వచ్చేసింది. సరికొత్త స్టిక్కరింగ్, గ్రాఫిక్స్ మొదలగు ఫీచర్లు ఈ బైక్ లో పొందుపరచడం జరిగింది. అంతేకాదు ఈ బైకు బ్లూటూత్ టెక్నాలజీ కూడా కనెక్టివిటీ అందుబాటులో ఉంది. ఇక పాత మోడల్ బైక్ తో పోలిస్తే ఈ బైక్లో కాస్త సీట్లను కూడా అప్డేట్ చేశారు. లైన్ గ్రీన్, పెరల్ వైట్ అనే రెండు రంగులలో అందుబాటులోకి వచ్చింది ఈ బైక్. అయితే ఇప్పటికీ ఈ బైక్ కోసం బుకింగ్స్ మొదలవగా... లాక్ డౌన్ తర్వాత ఈ కొత్త మోటర్ బైక్ లను డెలివరీ లను అందజేయనుంది సంస్థ.

 


ఇక ఈ బైక్ ఇంజన్ విషయానికి వస్తే దీనిని bs6 అనుగుణంగా దీన్ని రూపొందించారు. 649 పార్లల్ సిలిండర్ను ఇంజన్ కలిగి ఉంది. ఇంకా ఇది 15 లీటర్ల ఇంధన ట్యాంక్ కూడా సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఈ బైక్ 196 కేజీలు బరువు కలిగి ఉంది. అలాగే డిజైన్ విషయానికి వస్తే ఈ బైక్ ని పూర్తిగా రీడిజైన్ చేశారని చెప్పవచ్చు. Led హెడ్  లైట్స్, పెద్ద ఫ్యూయల్ ట్యాంక్ ను ఇందులో ప్రధానంగా మార్చిన దానిలో చెప్పే మార్పులు.

మరింత సమాచారం తెలుసుకోండి: