భారతదేశంలో పేద ప్రజల నుంచి మధ్యతరగతి ప్రజల వరకు ఎక్కువగా వాడే వాహనం మోటార్ సైకిల్. అలాంటిది ఒక సామాన్యుడు మోటర్ బైక్ కొనాలి అంటే మొదటిగా ఆలోచించేది బండి యొక్క మైలేజ్. అవును మీరు విన్నది నిజమే. చాలా కంపెనీలు చేసిన సర్వేలో ఈ విషయమే రుజువైంది కూడా. అయితే ఇప్పుడు కొందరు కేవలం మైలేజీ కాకుండా బండి యొక్క లుక్, స్టైల్ లాంటి మొదలగు ఫీచర్ల కొరకు చూస్తున్నారు కూడా.


అయితే ఇక ఎక్కువ మైలేజీని ఇచ్చే మోటార్ సైకిళ్లకు ప్రసిద్ధి చెందిన సంస్థ బజాజ్. ఇక ఈ కంపెనీలో చాలా బైకులు మార్కెట్ లో ఉండే అన్ని బైక్స్ కంటే ఎక్కువ మైలేజ్ వస్తాయి అని అందరికీ తెలిసిన విషయమే. అందులో కూడా బజాజ్ ప్లాటినా చాలా విజయం సాధించింది కూడా. ఈ బైకు ముఖ్యంగా సామాన్యులకు, గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఈ బైక్ చాలా దగ్గరైంది. అయితే ఇక అసలు విషయం ఏమిటంటే ... తాజాగా నిర్దేశించిన కాలుష్య నియంత్రణకు అనుగుణంగా..  BS 6 మోడల్ ని భారత మార్కెట్లోకి విడుదల చేసింది బజాజ్ వాహన సంస్థ. ఈ బైక్ షోరూం లో రూ. 47,763 లుగా ధర నిర్దేశించింది. 

 

ఇకపోతే ఈ బైక్ రెండు వేరియంట్స్ లో మనకు లభ్యమవుతుంది. రెండు వేరియంట్లలో లభ్యమవుతున్న ఈ బైక్... వేరియంట్ల వారీగా ధరలో చాల తేడా ఉంది. BS 6 ప్లాటినా 100 కేఎస్ వేరియంట్ ధర వచ్చేసి  రూ. 47,763 ఉండగా, ప్లాటినా 100 ఈఎస్ ఎలక్ట్రిక్ స్టార్ట్ వేరియంట్ ధర రూ.55,546 కంపెనీ నిర్దేశించింది. ఇక అంతే కాకుండా 11 లీటర్ల ఇంధన ట్యాంకు సామర్థ్యం ఇందలో ఉంది. ఎక్కువ మైలేజ్ ఇచ్చే ఈ మోటార్ సైకిల్ గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ప్రజలకు బాగా ఉపయోగపడుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: