2020 W800 స్ట్రీట్ క్రూయిజర్ బైక్ వివరాలను కవాసకి ఇండియా తన అధికారిక వెబ్ ‌సైట్‌ లో అప్‌ డేట్ చేసింది ఆ కంపెనీ. ఇకపోతే కవాసకి కొత్త మోడల్ బైక్ ధరను ఇండియన్ ఎక్స్‌టిర్రియర్ ధరగా రూ. 6.99 లక్షలకు నిర్ణయించారు. ఈ ధర పాత మోడల్ తో పోలిస్తే  రూ. 1 లక్ష తక్కువగా ఉంది. కవాసకి W800 స్ట్రీట్ బైక్‌ ను కవాసకి కంట్రీ మార్కెట్‌ లో గత సంవత్సరం విడుదల చేశారు. ఇది వరకు ఆ బైక్ ధర అప్పుడు రూ. 7.99 లక్షలు గా ఉండేది. నిజానికి ఆ బైక్ ధర తగ్గించడం నిజంగా శుభ పరిణామమే.

IHG


ఇకపోతే ఇదే విభాగంలో ట్రయంఫ్ స్ట్రీట్ ట్విన్ బైక్ ధర రూ. 7.45 లక్షలుగా ఉంది. ఇప్పుడు ఈ బైక్ ధర కూడా బాగా తగ్గించబడింది. ఇక ధరను భారీగా తగ్గించడం వల్ల ఈ విభాగంలో ప్రజలు W800 స్ట్రీట్ క్రూయిజర్ బైక్ వైపు ఆకర్షితులవుతారని కంపెనీ అనుకుంటుంది. ఇక ఈ బైక్ డిజైన్ విషయానికొస్తే, ఇంజిన్ మినహా మిగతా ఏ మార్పులు ఇందులో చేయలేదు. ఈ బైక్ మోడల్ కవాసకి W - 1 650 cc బైక్ నుండి తీసుకోబడింది. ఈ బైక్ ‌లో రౌండ్ LED హెడ్ ‌లైట్లు అమర్చారు. అంతేకాకుండా ఈ బైక్ ‌లో టైర్ డ్రాప్ ఫ్యూయల్ ట్యాంక్, స్పోక్ వీల్స్, వైడ్ హ్యాండిల్ బార్ అండ్ సెంటర్ సెట్ ఫుట్ పెగ్స్ ను అమర్చారు. ఈ బైక్ ‌కు రెట్రో లుక్ ఇచ్చేందుకు, ట్విన్ పాడ్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్‌ లో క్రోమ్, డిజిటల్ రీడౌట్ ను అమర్చారు.

 

IHG


ఇందులోని ఇంజిన్ 4,800 Rpm వద్ద 62.9 nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్ ‌లో అసిస్ట్, స్లీపర్ క్లచ్ అలాగే అడ్జస్టబుల్ లివర్ కూడా ఇందులో ఉన్నాయి. ఇక కవాసకి బైక్ ‌పై డ్యూయల్ ఛానల్ ABS‌ను కూడా ఉంటుంది. ఇక ఈ బైక్ చూడటానికి చాలా ఆకర్షణీయంగా, గొప్పగా ఉంటుంది. ఇకపోతే వాహనదారునికి మంచి రైడింగ్ అనుభూతిని కూడా ఈ బైక్ అందిస్తుంది. ఇప్పుడు ఈ బైక్ పై ఆ కంపెనీ భారీ తగ్గింపును ప్రకటించడం చేత ఎక్కువగా అమ్ముడయ్యే అవకాశం ఉండబోలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: