దేశంలో రోజురోజుకీ మధ్య తరగతి ప్రజలు, కాస్త డబ్బున్న వాళ్ళు అందరూ చిన్న చిన్న దూరాలకు, లేకపోతే ఎక్కడికైనా బయటకు వెళ్లడానికి కారులో వెళ్ళడానికి మొగ్గుచూపుతున్నారు. ఇక భారత దేశంలో రోజురోజుకీ కార్ల వాడకం ఎక్కువ అయితున్న సంగతి అందరికి తెలిసిన విషయమే. ఇక అందులోనూ ఎలక్ట్రికల్ కార్లు యొక్క వాడకం కూడా ఎక్కువ అవుతుందని చెప్పవచ్చు. దీని కోసం దేశంలోని అగ్రగామి ఆటో సంస్థలు ఒకదాన్ని మించి ఒకటి కొత్త హంగులతో ఎలక్ట్రిక్ కార్లను ఉత్పత్తి చేస్తున్నాయి.

 

అయితే ఇక కరోనా వైరస్ నేపథ్యంలో ఆటోమొబైల్ రంగం చాలా దెబ్బతిని అని చెప్పవచ్చు. ముఖ్యంగా తయారీ ఇండస్ట్రీ లను, కార్ల షోరూమ్ లను మూసివేయడంతో వాటి అమ్మకాలకు చాలా తక్కువ అయిపోయింది. ఇక అసలు విషయానికి వస్తే.. కార్ల తయారీలో అగ్రగామిగా సంస్థ అయిన మారుతి సుజుకి తన ఐకానిక్ కారు మారుతి 800 విద్యుత్ తో నడిచే వాహనంగా తీర్చిదిద్దుతోంది. ఇక ఈ మోడల్ లో వచ్చే సంవత్సరం విడుదల చేయబోతుంది అని కూడా కంపెనీ ప్రకటించింది. ఇంతకుముందు కార్లు మొదటగా వచ్చే సమయంలో మారుతి 800 ఉంది అంటే వారు కాస్త డబ్బు ఉన్న వారిని అప్పట్లో అనుకొనేవారు. 


ఇక ఈ కారు మూడు దశాబ్దాలకు పైగా భారతదేశ వినియోగదారులు అభిమానాన్ని చూసిన విషయం అందరికీ తెలిసిందే. ఇకపోతే మారుతీ 800 తర్వాత  అంబాసిడర్ కార్ ఎక్కువ కాలం మార్కెట్లో నడిచిందని చెప్పవచ్చు. ఇక అంబాసిడర్ కార్లు భారతదేశంలో ఏకంగా 27 లక్షలు పైగా అమ్ముడుపోయాయి అంటే వాటి వినియోగం ఎలా ఉండేదో ఇలాగే అర్థం చేసుకోవచ్చు. పాత మారుతి 800 మోడల్ తో పోలిస్తే ఈ కారును మరింత కొత్త లుక్ తో అదిరిపోయే విధంగా ఈ కారణ రూపొందించుకోండి కంపెనీ. మారుతీ ఎలక్ట్రికల్ కార్లలో మొదట మారుతి 800 మోడల్ వాహనదారులకు అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు కంపెనీ వర్గాలు సూచనప్రాయంగా తెలిపాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: