ప్రస్తుతం భారత్ లో ఆటోమొబైల్ రంగం సంస్థలు చాలా నష్టాల్లో ఉన్నాయి. దీనికి కారణం కరోనా వైరస్. లాక్ డౌన్ నేపథ్యంలో అటు తయారీ పరిశ్రమలు, ఇటు కార్ల షోరూమ్స్ మూసివేయడంతో వాహనాల అమ్మకాలు పూర్తిగా నిలిచిపోయాయి. అయితే కేవలం ఆన్ లైన్ లో మాత్రం బుకింగ్స్ ని చేయడం వల్ల కొన్ని కంపెనీలు బుకింగ్ ను అందుకున్నాయి. అయితే ఈ హత్యకు సంబంధించిన డెలివరీలు కూడా లాక్‌డౌన్‌ ముగిసిన తర్వాతనే ఇవ్వనున్నట్లు కంపెనీలు తెలిపాయి. 


అయితే కంపెనీలు తమ విక్రయాలను పెంచుకునేందుకు ప్రజలకు తాజాగా మారుతి సుజుకి సంస్థ తన కార్స్ పై రాయితీలను ఇచ్చింది. తన కంపెనీ లోని వివిధ కార్స్ కి సంబంధించి 15 వేల రూపాయల నుంచి 40 వేల రూపాయల వరకు డిస్కౌంట్లను ప్రకటించింది మారుతి సంస్థ. కేవలం డిస్కౌంట్ కాకుండా ఎక్స్చేంజ్ ఆఫర్ లను కూడా అందించింది ఆ కంపెనీ.


మారుతి ఎర్టిగా mpv మెరుగైన బెనిఫిట్ లు కల్పించారు. ఈ వాహనంపై ఏకంగా 25 వేల రూపాయల క్యాష్ బ్యాక్ తో పాటు ఎక్స్ చేంజ్ ఆఫర్ ని కూడా ప్రకటించింది. ఇక మరో కార్ అయినా బాలెనో కారుపై 45 వేల రూపాయలు ఆదా చేసుకోవచ్చు. అయితే తాజాగా విడుదలైన మారుతి సుజుకి సియాజ్ కారుపై 35 వేల రూపాయల వరకు క్యాష్ డిస్కౌంట్ ని ప్రకటించింది మారుతి సంస్థ. అంతేకాదు ఎక్స్ చేంజ్ ఆఫర్ కూడా పదివేల వరకు ఈ కారుపై ఇచ్చింది. ఇక వివిధ కార్లపై డిస్కౌంట్స్ అలాగే ఎక్స్చేంజ్ ఆఫ్ ఇచ్చిందో ఒకసారి చూద్దామా.


మోడళ్లు                 క్యాష్ బ్యాక్       ఎక్స్ ఛేంజ్
ఆల్టో 800                 రూ.25,000      రూ.15,000
ఎస్-ప్రెసో               రూ.15,000       రూ.20,000
సెలేరియో              రూ.30,000        రూ.20,000
ఈకో                  రూ.15,000        రూ.20,000
వాగన్ ఆర్               రూ.15,000        రూ.20,000
స్విఫ్ట్                       రూ.25,000    రూ.25,000
డిజైర్                      రూ.20,000     రూ.15,000
ఎర్టిగా                     రూ.15,000      రూ.10,000
ఇగ్నీస్                    రూ.40,000     రూ.30,000
సియాజ్                 రూ.35,000      రూ.10,000
బాలెనో                   రూ.30,000      రూ.15,000.

 

మరింత సమాచారం తెలుసుకోండి: