మారుతి సుజుకి ఆటోమొబైల్ సంస్థ మరోసారి బంపర్ ఆఫర్ ను ప్రకటించింది. గత మూడు నెలలుగా ఆటో రంగం కుదేలు అయిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. అటు ఉత్పత్తి రంగం మొదలు అవ్వక పోగా, ఇటు బయట షో రూమ్ తెరుచుకోకపోవడంతో చాలా ఇబ్బంది పడ్డాయి ఆటోమొబైల్ రంగ సంస్థలు. అయితే ప్రస్తుతం కొన్ని సడలింపు ద్వారా కొన్ని ప్రాంతాల్లో వీటిని తెరుచుకోవడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే ప్రజలను తమవైపు ఆకర్షించుకోవడానికి కంపెనీలు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది.


ఇదే కోవలోకి ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి కూడా చేరింది. మారుతి సుజికి సంస్థ భారీ ఆఫర్ ను ప్రకటించింది. కరోనా సంక్షేమంలో ఇబ్బందులు పడుతున్న వారు కూడా కారుని చాలా సులువుగా కొనుగోలు చేసేందుకు ఒక అదిరిపోయే ఆఫర్ ను తీసుకు వచ్చింది ఆ సంస్థ. ఎం అండ్ ఎం తరహాలోనే " బై నౌ - పే లెటర్ " అనే ఆఫర్ ను తీసుకువచ్చింది మారుతి సుజుకి సంస్థ. ఇక ఈ సంస్థ చోళమండలం ఇన్వెస్ట్మెంట్ అండ్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్ తో ఈ ఒప్పందాన్ని చేసుకుంది. ఈ ఆఫర్ లో భాగంగా కారు తీసుకున్న వారు రెండు నెలల వరకు ఈఎంఐ కట్టవలసిన అవసరం లేదు. రెండు నెలల తర్వాతనే ఈఎంఐ కట్టడానికి ఇందులో సులభతరం చేశారు. ఇక ఇలాంటి సులభమైన ఫైనాన్సింగ్ ఆప్షన్ ద్వారా తమ కంపెనీ కార్ల అమ్మకాలు జోరందుకున్నాయి మారుతి సుజుకి సంస్థ భావిస్తోంది.


ఇక కరోనా నేపథ్యంలో లిక్విడిటీ క్రంచ్ ఎదుర్కొంటున్న వారిని టార్గెట్ చేసుకుని ఈ ఆఫర్ ను తెచ్చినట్లు మారుతి సుజుకి తెలిపింది. ఇక ఈ కొనుగోలుదారుల పై వెంటనే అదనపు ఒత్తిడి లేకుండా వినియోగదారులను కొనుగోలు వైపుగా ఈ ఆఫర్ ఉందని సంస్థ తెలిపింది. అయితే ఈ ఆఫర్ కేవలం మారుతి సుజుకి సంస్థ తెలిపిన కొన్ని మోడల్స్ పైన వర్తిస్తుందని ఆ సంస్థ ప్రకటించింది. ప్రస్తుతం దేశంలో 1964 నగరాల్లో ఉన్న 3026 మారుతి సుజుకి అవుట్ లెట్స్ లో ఈ ఆఫర్ జూన్ 30వ తారీకు వరకు ఉంటుందని సంస్థ తెలియజేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: