ద్విచక్ర వాహనాలకు బాగా ప్రాచుర్యం చెందిన సంస్థల్లో బజాజ్ కూడా ఒకటి. బజాజ్ నుంచి బాగా పాపులర్ అయిన బైక్ పల్సర్. ఈ బైకులు గత రెండు దశాబ్దాలుగా భారత మార్కెట్లో ప్రతి సంవత్సరం రికార్డులను సృష్టిస్తూనే ఉన్నాయి. ఇక ఈ బజాజ్ పల్సర్ సిరీస్ లో బాగా ప్రాచుర్యం చెందిన బైక్ RS 200. అయితే ఈ బైకు విలువను ఆ కంపెనీ కొత్తగా మార్కెట్లో రూ. 1,48,467  గా నిర్ణయించింది. ఈ కొత్త పల్సర్ ఆర్ఎస్ 200 బైక్ యొక్క హార్డ్ వేర్ చాలా అప్ డేట్ చేయబడ్డాయి. ముఖ్యంగా ఈ పైకి అదిరిపోయే లుక్ ని తీసుకు వచ్చారు. ఆ లుక్ యువకులకు ఇట్టే నచ్చేస్తుంది అంటే నమ్మండి. కొత్త బజాజ్ పల్సర్ ఆర్ఎస్ 200 బైక్ లో 199.5 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజన్ ను ఇది కలిగి ఉంది. ఏంజెల్ 9750 rpm వద్ద 24.15 bhp శక్తిని ఇది విడుదల చేస్తుంది. అయితే ఈ ఇంజన్ 6 స్పీడ్ గేర్ బాక్సుతో జతచేయబడి ఉంది.


అంతేకాకుండా ఈ పల్సర్ RS 200 బైక్ ‌లో LED డిఆర్‌ఎల్‌లు, LED టైల్లైట్స్, బ్లింకర్స్, ఫుల్ సైజ్ ఫెయిరింగ్,  క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్ ఇంకా స్ప్లిట్ స్టైల్ సీట్లతో ట్విన్ పాడ్ ప్రొజెక్టర్లు ఇందులోఉన్నాయి. బజాజ్ ఆటో ఇటీవల తన ప్రసిద్ధ పల్సర్ NS 200 బైక్‌ను BS - 6 వెర్షన్ ‌లో విడుదల చేసింది. బజాజ్ ఆటో ఈ పల్సర్ NS 200 బైక్ ధరను రూ. 350 కు పెంచింది. ధరను పెంచిన తరువాత, షోరూమ్ ప్రకారం ఈ బైక్ ధర రూ. 1,28,531 గా నిర్ణయించారు.

 

 

ఇక BS 6 పల్సర్ NS 200, 99.5 cc, ఫోర్-వాల్వ్ లిక్విడ్-కూల్డ్ ఇంజిన్‌ తో ఈ బైక్ పనిచేస్తుంది. ఈ ఇంజన్ 24.2 BHP శక్తిని మరియు 18.5 NM టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ బజాజ్ పల్సర్ బైకులు చూడటానికి చాలా ఆకర్షణీయంగా తయారు చేసింది సంస్థ.

మరింత సమాచారం తెలుసుకోండి: