ప్రస్తుతం భారత దేశంలో కరోనా వైరస్ ప్రభావం తగ్గించడం కోసం నాలుగవ సారి లాక్ డౌన్ కొనసాగుతున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. ఈసారి కేంద్ర ప్రభుత్వం కొన్ని సడలింపులు ఇచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. ఇక ఈ నేపథ్యంలో జూమ్ సంస్థ తన ఆపరేషన్ ను ప్రారంభించింది. ఇకపోతే ఈ జూమ్ సంస్థ దేశంలోని 35 నగరాల్లో తిరిగి తన కార్యకలాపాలను మొదలు పెడుతుంది. ఇక మళ్లీ తన కస్టమర్స్ ను ఆకర్షించడానికి జూమ్ సంస్థ కొత్తగా జూమ్ టు సెల్ఫ్ రిలయన్స్ అనే కొత్త ప్రాజెక్ట్ ను అమల్లోకి తెచ్చింది. 


అయితే ఇక ఈ కొత్త పథకం విషయం చూస్తే..  ఈ పథకం కింద జూమ్ కార్ తన వినియోగదారులకు 100% తగ్గింపు అలాగే అపరిమిత రీసెట్ ఎంపికలను అందించబడుతుంది. కొత్త వినియోగదారులను ఆకట్టుకునేందుకు ఇలాంటి ప్రాజెక్టులను జూమ్ సంస్థ ముందుకు తీసుకొస్తుంది. ఇకపోతే తాజాగా జూన్ సంస్థ మంగళూరు, బెంగళూరు, హైదరాబాదు, చెన్నై, వైజాగ్, కొచ్చి, కాలికట్, గౌహతి, సిలిగురి, భువనేశ్వర్ ఇంకా కొన్ని దక్షిణ భారతదేశ నగరాలలో వీటి కార్యకలాపాలను తిరిగి ప్రారంభించనుంది. మైసూర్, నార్త్, వెస్ట్ లో ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు కంపెనీ వాహనాలను నడుపుతోంది.


ఇకపోతే సంస్థ అందించిన 100 శాతం తగ్గింపులో మొదటి బుకింగ్ పై 50 శాతం తగ్గింపు అలాగే 50 శాతం క్యాష్ బ్యాక్ రూపంలో లభించనున్నాయి. అయితే ఇది కేవలం మే 26 నుంచి 29 వరకు చేసిన కొన్ని బుకింగ్ లకు మాత్రమే వర్తిస్తుందట. జూన్ ఒకటో తారీకు లోపల బుక్ చేసుకొనే వినియోగదారులు ZAN100 అనే ప్రోమో కోడ్ ని ఉపయోగించి వాహనాలను బుక్ చేసుకోవచ్చని సంస్థ తెలిపింది. ఇక అలాగే 1, 3 , 6 నెలల ఒకేసారి కార్ తీసుకొనే వినియోగదారులకు కార్లు అందించుటకు ఎంపిక చేసుకొనే  కొత్త ప్రక్రియను కంపెనీ విడుదల చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: