గత మూడు నెలల నుంచి దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతుండడంతో ఆటోమొబైల్ రంగ సంస్థలు చాలా దెబ్బతిన్నాయి. లాక్ డౌన్ దెబ్బకి ఆటోమొబైల్ రంగంలోని అన్ని సంస్థలు చాలా నష్టాలు తెచ్చుకున్నాయి. అమ్మకాలు లేక ఆర్థికంగా ఒత్తిడిని ఈ రంగం ప్రస్తుతం ఎదుర్కొంటుంది. ఇకపోతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సడలింపుల కారణంగా ఇప్పుడిప్పుడే ఆహార సంస్థ డీలర్లు నెమ్మదిగా విక్రయాలు మొదలు పెట్టారు. చాలా రోజుల నుంచి వాహనాలు షోరూం లో ఉండడం వలన ప్రజలకు భారీ డిస్కౌంట్లు ఇచ్చి అమ్మకాలు చేయాలని చూస్తున్నారు సంస్థ యజమానులు. ఇప్పుడు తాజాగా టాటా మోటార్స్ కూడా తన వాహనాలపై భారీ రాయితీలను ప్రకటించింది. ఈ రాయితీలు దేశంలోని అన్ని డీలర్ల వద్ద అందుబాటులోకి రానున్నాయి. మరి ఏ వాహనం పై ఎంత డిస్కౌంట్ అనేది ఒకసారి చూద్దామా...

 


మొదటగా టాటా హ్యారియర్ పై అత్యధికంగా 30 వేల రూపాయలు వరకు కస్టమర్ కు డిస్కౌంట్లు లభించనుంది. ఇక అంతే కాకుండా టాటా టిగోర్ మోడల్  20 వేల రూపాయల వరకు అవుట్ రేట్ క్యాష్ డిస్కౌంట్ సంస్థ ప్రకటించింది. టాటా టియాగో హెచ్ బ్యాక్ పై 15 వేల వరకు క్యాష్ బ్యాక్ డిస్కౌంట్ ను కల్పించింది. దీనితోపాటు ఈ కారుకు పదివేల రూపాయల ఎక్స్చేంజి ఆఫర్ ని కూడా ప్రకటించింది. ఇక సంస్థకు సంబంధించి టాటా ఆల్ట్రాస్ మినహా మిగతా అన్ని కార్లపై 5000 వరకు డిస్కౌంట్ ను ప్రకటించింది. ఇక గరిష్టంగా కార్పొరేటర్ గా  తీసుకునే సంస్థలకు 15 వేల వరకు ఈ డిస్కౌంట్ ని అందించింది. ఇవన్నీ కలుపుకుంటే టాటా హ్యారియర్ పై గరిష్టంగా 45 వేల వరకు వినియోగదారులు లబ్ధి పొందనున్నారు.

 


అయితే ఈ ఆఫర్ ని కేవలం మూడు రోజుల వరకే అందుబాటులో ఉంచింది. అది కూడా మే 31న చివరగా తేదీన ప్రకటించండి. అది కూడా అన్ని మోడల్స్ పై మాత్రమే ప్రకటించింది సంస్థ. టాటా నెక్సన్, టాటా ఆల్ట్రోజ్ వంటి వాహనాలపై మాత్రం ఎటువంటి రాయితీ ఇవ్వలేదు. ఇక అవి మామూలు ధరల లోనే ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: