ఇటలీకి చెందిన ఆటో సంస్థ వెస్పా భారతదేశంలో తన మార్కెట్ ను మెరుగుపరుచుకునేందుకు చాలా ప్రయత్నాలు చేస్తోంది. ఇదివరకే తన స్కూటర్లను అనేక మోడల్స్ లో భారత విపణిలోకి వదిలి చెప్పుకోదగ్గ లాభాలను గడిస్తోనే ఉంది. ఇకపోతే తాజాగా మరోసారి సరికొత్త స్కూటర్ ను భారత విపణిలోకి విడుదల చేసింది. BS - 6 కు అనుగుణంగా వెస్పా స్కూటర్ నోటే 125 మోడల్స్ విడుదల చేసింది. ఇప్పటివరకు వెస్పా స్కూటర్ లోని అత్యంత తక్కువ ధర కలిగిన బండిగా ఈ వాహనం చెప్పుకోవచ్చు. ఈ వాహనాన్ని BS - 6 కాలుష్య నియంత్రణ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్ది భారత మార్కెట్లోకి రిలీజ్ చేయబడింది. ఇక ఈ స్కూటర్ ధర భారత మార్కెట్లో రూ. 91,492 గా సంస్థ నిర్దేశించడం జరిగింది.

IHG


ఇక ఈ కొత్త మోడల్ BS  4 మోడల్ తో పోలిస్తే వెస్పా స్కూటర్ నోటే 125 మోడల్ ధర బాగా పెరిగింది. అది కూడా ఏకంగా 19000 రూపాయలు పెంచింది. ఇంతకుముందు bs4 మోడల్ ధర రూ 72,030 గా ఉండగా అదే ప్రస్తుతం BS -6 91 వేలకు పైగా ధర నిర్ణయించడం జరిగింది. ఈ బైక్ లో పెద్దగా చెప్పుకోదగ్గ మార్పులేమీ తనుకు కనపడకపోయినా ఈ స్కూటర్ కొత్తగా మ్యాటి బ్లాక్ అనే కలర్ ఆప్షన్ తో అందుబాటులోకి తీసుకువచ్చింది. 

IHG


నిజానకి బైక్ చాలా స్టైలిష్ ఆకర్షణీయంగా ఉంది. ఇక ఈ బైక్ ఇంజన్ విషయానికి వస్తే.. 125cc సింగిల్ సిలిండర్ త్రీ-వాల్వ్ ఫ్యూయల్ ఇంజెక్టెడ్ ను ఈ స్కూటర్ కలిగి ఉంది. ఇక ఇందులో 9.28 BHP బ్రేక్ హార్స్ పవర్ 9.6 nm  టార్క్ ను ఉత్పత్తి చేయగలుగుతుంది. ఇది bs4 మోడల్ తో పోలిస్తే కాస్త ఎక్కువగానే ఉందని చెప్పవచ్చు. అంతేకాకుండా ఈ బైక్ ప్రత్యేకతలు చూస్తే సస్పెన్షన్ సిస్టం కాస్త బాగా చేశారని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: