ప్రస్తుత రోజుల్లో మధ్యతరగతి ప్రజలు కూడా కారులో ప్రయాణించడానికి ఇష్టపడుతున్నారు. దీనికి కారణం అనేక విషయాలు అని చెప్పవచ్చు. మరోవైపు కారులను కొనడానికి రుణాలు ఇవ్వడంతో మధ్యతరగతి ప్రజలు కూడా ఈ విషయంలో  ముందుకు వస్తున్నారు. ఇక పోతే ఎవరైనా సరే కొత్తగా కారు కొనాలనుకున్న, బైక్ కొనాలనుకున్న ముందుగా ఆలోచించే విషయం ఆ కారు లేదా బైక్ యొక్క ధర. ఈ ధర విషయంలో వారు ఎంత అనుకున్నారు దాని బట్టి కారుని ఎంపిక చేసుకుంటారు. ఇక అలాగే ధర విషయం తర్వాత చూసే మొదటి ఫీచర్ మైలేజ్. ధర కంటే ఎక్కువగా ఒకోసారి మైలేజ్ విషయంలోనే భారతీయులు చూస్తూ ఉంటారు. వీటి తర్వాతనే మిగతా ఫీచర్లు ఇంజన్ యొక్క సామర్థ్యం, అలాగే కారు యొక్క మిగతా సాంకేతిక ప్రమాణాలు చూసుకుంటారు. ఈ విషయంలో మాత్రం భారతీయులు మైలేజ్ కారణంగా కొంతమంది కొన్ని కార్లను కొనడానికి ఇష్టపడరు. మార్కెట్లోకి ఎప్పుడు కూడా బాగా మైలేజ్ వచ్చే వాహనాల గురించి వాకబు చేస్తూనే ఉంటారు. 

 

 

ఇకపోతే ప్రస్తుతం BS 4 నుంచి bs 6 కాలుష్య నియంత్రణ లకు అనుగుణంగా వాహన సంస్థలు అనేక మార్పులను తీసుకువచ్చాయి. ఇక వీటి కోసం అన్ని ఆటోమొబైల్ రంగ సంస్థలు వాటి వాహనాలు యొక్క ఇంజన్ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఇకపోతే ఏప్రిల్ 1 తర్వాత bs - 6 వాహనాలను మాత్రమే అనుమతించనున్నారు. ఈ కారణంతో అందుబాటు ధరలో మంచి మైలేజ్ ఇచ్చే కార్ల కోసం వినియోగదారులు ఎదురుచూస్తున్నారు. ఇకపోతే తాజాగా ఆటోమొబైల్ రంగ సంస్థలు భారత మార్కెట్లోకి బాగా మైలేజ్ ఇచ్చే కార్లను BS 6 కు అనుగుణంగా విడుదల చేశాయి. ఆ కార్లు ఏంటో ఇప్పుడు చూద్దామా. భారత్ లో ముక్యంగా టొయోటా గ్లాంజా పెట్రోల్ మ్యానువల్, మారుతీ సుజుకీ స్విఫ్ట్ పెట్రోల్ మ్యానువల్, మారుతీ సుజుకీ ఎస్-ప్రెసో పెట్రోల్ మ్యానువల్, బీఎండబ్ల్యూ ఎక్స్1 డీజిల్ ఆటోమేటిక్, మెర్సిడెజ్ బెంజ్ ఈ 220 డీ ఆటోమేటిక్ కార్స్ మనకు అందుబాటులో మంచి మైలేజ్ ఇస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: