భారతదేశంలో చాలావరకు మధ్యతరగతి కుటుంబాల వారు ప్రయాణించడం కోసం వారి బాధ్యతలు ద్విచక్ర వాహనాన్ని కొనుగోలు చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతారు. ఇలా కొనాలనుకునేవారు కేవలం బైక్ తక్కువ ధర మాత్రమే కాకుండా అనేక విషయాలమీద పరిశీలించి కొత్త బైక్ కొనడానికి ఆసక్తి చూపుతారు. ఇది ఇలా ఉండగా ద్విచక్ర వాహనాల్లో మోటార్ సైకిల్ తో పోలిస్తే ప్రస్తుతం స్కూటర్ లపై రోజురోజుకీ మంచి డిమాండ్ పెరుగుతోంది. ప్రస్తుతం ఎక్కువగా స్కూటర్ల పైన చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. గేర్ వ్యవస్థ లేని ఈ స్కూటర్లు సులభంగా డ్రైవ్ చేయడం మాత్రమే కాకుండా దగ్గరి గమ్యస్థానాలకు వెళ్లేందుకు చాలా సులువుగా సహకరిస్తున్నాయి. అంతే కాకుండా తాజాగా బి ఎస్ 6 ఇంజన్ వల్ల అధిక మైలేజ్ రావడమే కాకుండా పర్యావరణ కాలుష్యానికి కూడా ఎక్కువ ఇబ్బంది చేయకుండా స్కూటర్ ను మార్కెట్ లోకి రిలీజ్ అవుతున్నాయి.

IHG

 

ఇకపోతే ఈ స్కూటర్ లలో మెరుగైన ఇంజన్ ప్రదర్శన మాత్రమే కాకుండా కావలసినంత స్టోరేజ్ స్పేస్ కూడా మనకు లభిస్తున్నాయి. అయితే వీటిని ఎక్కువగా ఆడవారు ఉపయోగించడానికి ఇష్టపడతారు. కాకపోతే ప్రస్తుత కాలంలో వీటిని అందరూ విరివిగా ఉపయోగిస్తున్నారు అది వేరే సంగతి. ఇకపోతే తాజాగా భారత విపణిలో ఎన్నో స్కూటీలు కళ్ళకు మంచి ఆకర్షణీయంగా కనబడుతున్నాయి. దేశంలోని ఆటోమొబైల్ దిగ్గజ సంస్థలైన హోండా, హీరో, టీవీఎస్, సుజుకి మొదలగు సంస్థల నుంచి అద్భుతమైన స్కూటర్లను భారత మార్కెట్లోకి వదులుతున్నారు. ఆ స్కూటర్ లో అందుబాటులో ధరలతో పాటు ఎక్కువ కాలం మన్నిక వచ్చే విధంగా ఈ స్కూటర్ లలో మనము కొన్ని మంచి స్కూటర్ ల గురించి తెలుసుకుందామా. ప్రస్తుతం హోండా యాక్టివా 6జీ, టీవీఎస్ జూపిటర్, హీరో డెస్టినీ 125 , బీఎస్6 సుజుకీ యాసెస్ 125 , యమహా ఫ్యాసినో 125 లాంటి స్కూటర్లు ప్రస్తుతం భారత మార్కెట్ లో అత్యధికంగా అమ్ముడబోతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: