భారతీయ ఆటో దిగ్గజం కంపెనీ మారుతి సుజుకి తన సరికొత్త సెలెరియో మోడల్ ని భారత మార్కెట్లో విడుదల చేసింది. ఇకపోతే ఈ కారుకు సంబంధించి ఇప్పటికే పెట్రోల్, డీజిల్ మోడళ్లను మార్కెట్లోకి విడుదల చేసినప్పటికీ తాజాగా సిఎన్జి వేరియంట్ bs6 ప్రమాణాలకు అనుగుణంగా మార్పులు చేస్తూ కొత్త మోడల్ ను మార్కెట్లోకి విడుదలైంది. ఇకపోతే ఎక్స్ షోరూమ్ లో మారుతి సుజుకి సెలెరియో మోడల్ ప్రారంభ ధర రూ. 5.61 లక్షలు గా ఉంది. ఇక ఈ కారు రెండు వేరియంట్స్ లో లభ్యం కానుంది. Vxi , vxi (o ) వేరియంట్లలో దీన్ని మనం పొందవచ్చు.

 

IHG


ఇకపోతే వీటికి సంబంధించిన ధరలు కూడా వేర్వేరుగా ఉన్నాయి. ఈ కార్ల  ధర విషయానికి వస్తే బి ఎస్ 4 కార్లతో పోలిస్తే ఈ మోడల్ కు దాదాపు 30 వేల రూపాయలు ధరను పెంచింది కంపెనీ. అలాగే సెలెరియో vxi మోడల్ ధర రూ 5.61 లక్షలు కాగా, vxi (o ) ధర రూ 5.6 8 లక్షలు గా ఉంది. ఇక ఈ కార్ల ఇంజన్ విషయానికి వస్తే... సిఎన్జి వేరియంట్ పవర్ అవుట్ పుట్ వివరాలు సంస్థ ఇంకా తెలపలేదు. అయితే క్రితం మాదిరిగానే ఈసారి కూడా అవుట్ పుట్ వుంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక భారత మార్కెట్లో ఈ కారుకు పోటీగా హుండాయ్ కంపెనీ నుంచి వచ్చే శాంత్రో పోటీగా నిలువనుంది. శాంత్రో సీఎన్జీ మోడల్ కూడా రెండు వేరియంట్లలో లభ్యమవుతుంది. ఇక ఆ కారు ధర కూడా 5.85 లక్షల నుంచి 6.2 లక్షల వరకు ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: