మన భారతదేశంలో పల్సర్ బైకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చాలా వరకు వినియోగదారులు పల్సర్ వైపు మొగ్గు చూపిస్తారు. ఇక తాజాగా పల్సర్ 125 స్ప్లిట్ సీట్ వేరియంట్ పేరుతో బజాజ్ ఆటో భారత మార్కెట్ లోకి రిలీజ్ చేయడం జరిగింది. ఇక ఈ బైక్ సింగిల్ సీట్ డ్రం వేరియంట్ కలిగి అత్యున్నత టెక్నాలజీతో తయారు చేశామని సంస్థ తెలియజేయడం జరిగింది.

 

IHG


ఇకపోతే ఈ బైక్లో కొన్ని అదనపు ఫీచర్లను వినియోగదారులను బాగా ఆకట్టుకుంటాయని సంస్థ యాజమాన్యం తెలిపింది. ఇక ఈ బైక్ లో రెగ్యులర్ మోడల్ సింగిల్ యూనిట్ కు  బదులుగా స్పోర్టి బెల్లీ పాన్, స్పి‍ట్ గ్రాబ్ రైల్స్ లాంటి అదనపు ఫీచర్లను ఉపయోగించడం జరిగింది బజాజ్ సంస్థ తెలియజేసింది. ఇక పల్సర్ 125 బైక్ రంగు విషయానికి వస్తే బ్లాక్ రెడ్, బ్లాక్ సిల్వర్, నియర్ గ్రీన్ కలర్ లో మార్కెట్లోకి విడుదల చేసినట్లు తెలుస్తుంది.

IHG

 

ఇక అసలు విషయం అయినా ఈ వేరియంట్ ధర 79,091 గా కంపెనీ నిర్ణయించడం జరిగింది. ఇక ఈ బైక్ ను వినియోగదారులకు మార్కెట్లో అందించడం ద్వారా బజాజ్ ఆటో ప్రెసిడెంట్ సారంగ్  కనడే హర్షం వ్యక్తం చేయడం జరిగింది. ఇంకా అలాగే స్పందిస్తూ... గత ఏడాది విడుదల చేసిన పల్సర్ 125 బైక్ కేవలం ఆరు నెలల్లోనే లక్ష బైక్లను వినియోగదారులను కొనుగోలు చేశారని ఆయన తెలియజేశారు. అలాగే స్పోర్ట్స్ బైక్ ను ఎక్కువశాతం ఇష్టపడే వారికి సరికొత్త స్టైల్ లో ఈ బైక్ అందర్నీ ఆకర్షిస్తుందని ఆయన తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: