చాలా రోజుల నుండి వాహన ప్రియులను ఊరిస్తూ ఉన్న బైక్ ఎట్టకేలకు భారత మార్కెట్లో విడుదలయింది. బ్రిటిష్ మోటార్ సైకిల్ ట్రైంఫ్ తన కొత్త అడ్వెంచర్ బైక్ ను విడుదల చేసింది. దాని పేరే ట్రైంఫ్ టైగర్ 900. ఇకపోతే ఇది అడ్వెంచర్ మోటార్ సైకిల్. ఎక్కువ పర్యటనల కోసం వెళ్లే వారి కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ ద్విచక్ర వాహనం ప్రస్తుతం మార్కెట్లో అందరి దృష్టి ఆకట్టుకుంటుంది. ఇక ఈ బైక్ ధర విషయానికి వస్తే షోరూంలో రూ 13.7 లక్షలు గా ఉంది. ఈ బైకులో అనేక అత్యాధునిక హంగులు, ప్రత్యేకతలను రూపొందించారు.

IHG


బైక్ లో మొత్తం మూడు వేరియంట్స్ మనకు లభ్యం కానున్నాయి. మూడు వేరియంట్స్ లో లభ్యమవుతున్న వీటికి వివిధ ధరలు ఉన్నాయి. ఇక వాటి విషయాలకు వస్తే.... జీటీ (రోడ్ ఫోకస్డ్) వేరియంట్ ధర రూ.13.70 లక్షలు, ర్యాలీ (ఆఫ్ రోడ్) వేరియంట్ ధర రూ.14.35 లక్షలు, టాప్ వేరియంట్ ర్యాలీ ప్రో ధర రూ.15.50 లక్షలు. 

 

IHG

 


కొత్తగా వచ్చిన ఈ మోటార్ సైకిల్ అగ్రెసివ్ లుక్ తో మరింత ఆకర్షణీయంగా కనబడుతోంది. ఎల్ఈడి హెడ్ క్యాంపులు, ఎల్ఈడి డిఆర్ఎల్ మొదలగు కొన్ని ప్రత్యేకతలతో ఈ బైక్ చూపరులను ఇట్టే ఆకట్టుకుంటుంది. ఈ మోటార్ సైకిల్ 6 - రైడింగ్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. వాటిలో రెయిన్ రోడ్, ఆఫ్ రోడ్ ప్రో, ఆఫ్ రోడ్, స్పోర్ట్, రైడర్ రైడింగ్ ఆప్షన్లు ఇందులో ఉన్నాయి. వీటితో పాటు స్మార్ట్ ఫోన్ కనెక్టెడ్ బ్లూటూత్ ఆప్షన్ కూడా ఇందులో కలిగి ఉంది. వీటితో పాటు గో ప్రో యాక్షన్ ప్రో కెమేరా, లెఫ్ట్ సైడ్ హ్యాండిల్ బార్లు, టీఎఫ్టీ డిస్ ప్లే, ఆన్సర్ కాల్స్, రీడ్ మేసెజెస్ అనేక ప్రత్యేకతలు ఇందులో కొత్తగా రాబోతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: