దేశంలో కరోనా కారణంగా చాల మంది ఆర్థికంగా నష్టపోయారు. అయితే వారు కొత్తగా కారు కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నారా? అయితే కారు కొనేందుకు లోన్ తీసుకోవాలని అనుకుంటున్నారా..? ఏ బ్యాంక్‌లో రుణం పొందాలో అర్థంకావడం లేదా..? అయితే అలాంటి వారి కోసమే ఈ న్యూస్. మీరు బ్యాంక్‌లో కార్ లోన్ తీసుకునే ముందు పలు అంశాలు పరిగణలోకి తీసుకోవాలన్నారు. ఇప్పుడు టాప్ బ్యాంకులు ఏఏ వడ్డీకి కార్ లోన్స్ అందిస్తున్నయో ఒక్కసారి చూద్దామా.

 

 

దేశీ దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ప్రైవేట్ రంగ దిగ్గజ బ్యాంక్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వంటివి కాకుండా వేరే ఇతర బ్యాంక్ తక్కువ వడ్డీకే కార్ లోన్ అందిస్తోంది. అదే పంజాబ్ నేషనల్ బ్యాంక్. ఈ బ్యాంక్ ‌లో కార్ లోన్‌పై వడ్డీ రేటు 7.1 శాతం నుంచి ప్రారంభమౌతోంది. కారు ఆన్‌రోడ్ ధరలో 85 శాతం వరకు మొత్తాన్ని లోన్ కింద తీసుకోవచ్చునన్నారు. ఈ మొత్తం దాటితో అప్పుడు ప్రాసెసింగ్ ఫీజు రూ.1500. దీనికి జీఎస్‌టీ అదనంగా పడుతున్నారు.

 

 

ఇకపోతే ఎస్‌బీఐ కార్ లోన్ విషయానికి వస్తే.. వడ్డీ రేటు 7.95 శాతం నుంచి ఆరంభమౌతోందన్నారు. కారు ఆన్‌రోడ్ ధరలో 90 శాతం వరకు మొత్తాన్ని రుణం కింద పొందొచ్చునన్నారు. ఇక హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్ లోన్‌పై వడ్డీ రేటు 8.8 శాతం నుంచి 10 శాతం మధ్యలో ఉన్నాయన్నారు. మహిళా కస్టమర్లకు 8.2 శాతం వడ్డీకే రుణాలు లభిస్తాయని తెలిపారు.

 


ఎస్‌బీఐ,హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుల కన్నా మరో బ్యాంక్ కూడా తక్కువ వడ్డీకే రుణాన్ని అందిస్తోంది.  ఈ బ్యాంక్ ఆఫ్ బరోడా కూడా కారు ఆన్‌రోడ్ ధరలో 90 శాతం వరకు మొత్తాన్ని రుణం కింద అందిస్తోందన్నారు. కారు లోన్‌పై వడ్డీ రేటు 7.1 శాతం నుంచే ఆరంభమౌతోందన్నారు. ఇక ఈ బ్యాంక్ ప్రాసెసింగ్ ఫీజు కింద 0.5 శాతం రుణ మొత్తాన్ని వసూలు చేస్తోందని నిపుణులు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: