జపాన్ మోటార్ సైకిల్ సంస్థ కవాసకి ఇటీవల తన 2021 నింజా 1000 sx బైక్ ను భారత మార్కెట్లోకి తీసుకువచ్చింది. అయితే ఈ బైక్ కొత్తగా డీలర్ షిప్ లోకి రావడం మొదలైంది. ఇక ఈ బైక్ కు సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే....

 

IHG

 


కొత్తగా వచ్చిన ఈ కవాసకి నింజా 1000 SX బైక్ ధర రూ 10.79 లక్షలు. ఈ బైకు భారతదేశంలో స్థానికంగా ఉత్పత్తి చేయబడిన మొట్టమొదటి ప్రీమియం స్పోర్ట్స్ బైక్. కొత్త హంగులతో రూపొందించిన 2021 నింజా 1000 SX బైక్ చాలా ఆకర్షణీయంగా దూకుడు స్వభావంగా కనబడుతుంది. ఈ బైకు అనేక కొత్త ఫీచర్లను కలిగి ఉండడమే కాకుండా అదిరిపోయే లుక్ తో కనబడుతోంది.

 

IHG

 


ఈ బైకు లో కొత్తగా బైక్ యొక్క సైడ్ ప్యానెల్ అలాగే కొత్తగా నవీకరించబడిన బెల్లీ పాన్ కూడా ఇందులో లభిస్తుంది. ఈ బైక్ లో ఉండే యాప్ ద్వారా స్మార్ట్ ఫోన్ ను కనెక్ట్ చేసుకుని, కొత్త 4.3 అంగుళాల టీఎఫ్టీ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఎల్ఇడి లైటింగ్ కలిగి ఉంటుంది. ఇందులో రైడర్ సీటు గత మోడల్ తో పోలిస్తే కాస్త వెడల్పుగా ఉంది. అంతేకాకుండా ఈ బైక్ లో అనేక అత్యాధునిక టీచర్స్ ను అందించడం జరిగింది. ఈ బైక్ లో కొత్తగా ఎలక్ట్రానిక్ క్రూయిస్ కంట్రోల్, క్విక్ సిస్టర్, కార్నింగ్ మేనేజ్మెంట్ ఫంక్షన్, ఆంటీ లాక్ బ్రేక్ సిస్టం, మల్టిపుల్ రైడింగ్ అలాగే ట్రాన్సాక్షన్ సిస్టం లాంటి అనేక ప్రత్యేకతలు ఈ బైకు సొంతం. ఈ బైకు మనకు రెండు రంగులలో లభిస్తుంది. మెటాలిక్ డయాబ్లో బ్లాక్ మరియు ఎంబ్రాల్డ్ గ్రీన్ లాంటి కార్బన్ గ్రే రంగులలో మనకు లభిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: