కరోనా మహమ్మారి దెబ్బతో ప్రపంచ మార్కెట్లో ఆటో మొబైల్ సంస్థలు తీవ్ర ఒడిదుడుకులకు లోనైంది. దీంతో ఇప్పుడిప్పుడే మళ్లీ పురోగతి వైపు నడుస్తుంది. లాక్ డౌన్ సందర్భంగా ఎన్నో కొత్త మోడళ్లను రిలీజ్ చేయాల్సి ఉండగా, అవి వాయిదాపడుతూ ఇప్పుడిప్పుడే మార్కెట్లోకి విడుదల అవుతున్నాయి. ఇకపోతే తాజాగా ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ హోండా తన సరికొత్త స్కూటర్ ను విడుదల చేసింది. దాని పేరు హోండా గ్రాజియా 125. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన బీఎస్-6 కాలుష్యం కేంద్ర ప్రమాణాలకు అనుగుణంగా స్కూటర్ ను తయారు చేసి మార్కెట్లోకి విడుదల చేసింది సదరు సంస్థ. ఈ స్కూటర్ ధర షోరూంలో రూ. 73336 గా సంస్థ పేర్కొంది.

IHG


ఇక ఈ స్కూటర్ మనకు రెండు వేరియంట్లలో లభించనుంది. వీటి ధర కూడా కాస్త వ్యత్యాసం ఉంది. డీలక్స్, స్టాండర్డ్ అనే రెండు వేరియంట్లలో ఈ స్కూటర్ మనకు దొరుకుతుంది. అయితే ఇదివరకే ఈ స్కూటర్ పై ఆన్లైన్ బుకింగ్స్ మొదలవగా దేశవ్యాప్తంగా ఉన్న హోండా డీలర్ల వద్ద ఈ స్కూటర్లను అందుబాటులోకి తీసుకువచ్చి డెలివరీలు ప్రారంభించనుంది.

 

IHG


ఇక పోతే ఈ స్కూటర్ డిజైన్ విషయానికొస్తే ఎల్ఈడి హెడ్ లంప్స్ లు, ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఆర్ ఏ సి జి, స్టార్టర్ మోటార్ ఇంజక్షన్ సిస్టం లాంటి అనేక ఆధునిక సిస్టమ్స్ ని ఇందులో పొందుపరిచారు. ఇక ఈ స్కూటర్ 125 సీసీ తో పని చేయనుంది. ఈ బైక్ ఇంజన్ విషయానికి వస్తే bs 6 ప్రమాణాలకు అనుగుణంగా మార్పులు చేసి 124 cc ఎయిర్ - కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజన్ తో అందుబాటులోకి ఈ స్కూటర్ వచ్చింది. దానితోపాటు ఆరువేల ఆర్పిఎమ్ వద్ద 8 BHP , ఐదువేల ఆర్పిఎమ్ వద్ద 10.3 nm టార్క్ ను ఉత్పత్తి చేయగలుగుతుంది. ఇక ఈ స్కూటర్ లో వి టైప్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ వ్యవస్థ కలిగి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: