వోల్వో.. మోటార్ రంగంలోనే మంచి పేరున్న బ్రాండ్.. అయితే ఇప్పుడు ఈ కంపెనీకి చెందిన కార్లను ఆ సంస్థ వెనక్కి పిలిపిస్తోంది. వంద కాదు.. వెయ్యి కాదు.. ఏకంగా ప్రపంచ వ్యాప్తంగా 21 లక్షల వోల్వో కార్లను వెనక్కి పిలిపిస్తున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుందంటే ఆ కారు అంత సేఫ్టీ కాదట.

 

 

అందుకే.. 2006 నుంచి 2019 మధ్య తయారైన 21 లక్షల కార్లను వెనక్కి పిలిపిస్తోంది. ఏ విషయంలో సేఫ్టీ అంటారా.. కారు ముందు సీటుకు చెందిన సీటుబెల్టుకు ఉండే స్టీల్ తీగలో లోపం ఉందట. అది ముందు ముందు బలహీనమయ్యే ఛాన్స్ ఉందట. ఈ లోపాన్ని ఇటీవలే ఆ సంస్థ ఆర్‌ అండ్ డీ బృందం కనిపెట్టింది. అందుకే.. ఆ లోపాన్ని సరిదిద్దేందుకే ఈ ప్రపంచంలోనే అతి పెద్ద రీకాలింగ్ కు పిలుపు ఇచ్చింది.

 

 

ఆ సీటు బెల్టులు ఉక్కు యాంకర్ సాయంతో కారుకు అనుసంధామై ఉంటాయి. ఈ సీటుబెల్టు వాడితే అది తెగిపోయే ప్రమాదం ఉంది. తమ వినియోగదారుల క్షేమమే ప్రధానంగా భావిస్తున్న ఈ వోల్వో కంపెనీ.. తన చరిత్రలోనే అతిపెద్ద రీకాలింగ్ కు పిలుపు ఇచ్చింది. మున్ముందు ఏ విధమైన ప్రమాదాలు జరగకుండా నిరోధించేందుకే ఈ చర్యలని వోల్వో ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: