దేశంలో కరోనా తన ఉగ్ర రూపం చూపిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. దేశంలో కరోనా ఉధృతి రోజురోజుకు పెరుగుతూనే ఉంది. ఈ మహమ్మారి కారణంగా దేశంలో చాల మంది జీవనోపాధిని కోల్పోయారు. ఈ మహమ్మారిని కొంత మేరకు అయినా అరికట్టేందుకు దేశంలో లాక్ డౌన్ విధించిన సంగతి విదితమే. అయితే ఈ కష్టకాలంలో ప్రజలకు అండగా నిలిచేందుకు అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభ్యుత్వాలు కొన్ని పథకాలను అందుబాటులోకి తీసుకువచ్చింది.

 

 

అయితే ఈ కష్టకాలంలో కొత్తగా బైక్ కొనుగోలు చేయాలని ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? లేదంటే స్కూటర్ కొనేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారా? అయితే మీకు శుభవార్త. మీకోసం అదిరిపోయే ఆఫర్ ఒకటి అందుబాటులో ఉందని నిపుణులు తెలిపారు. బైక్, స్కూటర్ కొనుగోలుపై ఏకంగా రూ.15 వేల భారీ తగ్గింపును సొంతం చేసుకోవచ్చునన్నారు.

 

 

అయితే దిగ్గజ వాహన తయారీ కంపెనీ హీరో మోటొకార్ప్ తాజాగా తన టూవీలర్లపై డిస్కౌంట్ ఆఫర్లను ప్రకటించిందని సమాచారం. దేశంలో బీఎస్ 6 నిబంధనలు అమలులోకి వచ్చాయన్నారు. ఏప్రిల్ 1 నుంచి బీఎస్ 6 వాహనల విక్రయాలు ప్రారంభమయ్యాయని తెలిపారు. అయితే బీఎస్ 4 వాహనాలు విక్రయించడానికి లాక్ డౌన్ ముగిసిన తర్వాత 10 రోజులే గడువు ఉంటుందని తెలియజేశారు.

 

 

ఈ నేపథ్యంలో హీరో మోటొకార్ప్ తన బీఎస్ 4 వాహనాలపై ఏకంగా రూ.15 వేల తగ్గింపును అందిస్తోందన్నారు. బైక్‌పై రూ.10,000, స్కూటర్‌పై రూ.15 వేల వరకు తగ్గింపు సొంతం చేసుకోవచ్చునన్నారు. అయితే ఆన్‌లైన్ బుకింగ్స్‌కు మాత్రమే ఇది వర్తిస్తుందన్నారు. షోరూమ్‌కు వెళ్లి కొంటే ఈ ఆఫర్ అందుబాటులో ఉండదని తెలియజేశారు.

 

 

ఈ మహమ్మారి కారణంగా ప్రస్తుతం చాలా చోట్ల షోరూమ్‌లు క్లోజ్‌లోనే ఉన్నాయన్నారు. అందువల్ల ఎవరైనా కొత్త బైక్ లేదా స్కూటర్ కొనుగోలు చేయాలంటే ఆన్‌లైన్‌లో కూడా బుకింగ్ చేసుకోవచ్చునని యాజమాన్యం తెలిపారు. ఇలా చాలా సంస్ధలు కరోనా వైరస్ దెబ్బతో ఆన్‌లైన్ అమ్మకాలు ప్రారంభించాయని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: