బైక్ లను ఇష్టపడని వారంటూ ఎవరు ఉండరు. చిన్న పిల్లల నుండి యుక్త వయస్సు పిల్లల వరకు బైక్ అంటే అందరికి మక్కువే. అయితే భారత మార్కెట్లో అత్యుత్తమ విక్రయాలు అందుకుంటున్న వాహన సంస్థల్లో ముందు వరుసలో ఉండే కంపెనీ హోండా. ఈ సంస్థ నుంచి తాజాగా బీఎస్6 హోండా ఎక్స్ బ్లేడ్ మోడల్ ను భారత విపణిలో విడుదల చేశారు.

 

 

బీఎస్6 ప్రమాణాలకు అనుగుణంగా మార్పులు చేసిన ఈ బైక్ ప్రారంభ ధర ఎక్స్ షోరూంలో రూ.1.05 లక్షలుగా సంస్థ నిర్దేశించిందని సమాచారం. సింగిల్ డిస్క్ ఫ్రంట్, డిస్క్ బ్రేక్ అప్ర్ ఫ్రంట్ అండ్ రేర్ అనే రెండు వేరియంట్లలో దీన్ని సొంతం చేసుకోవచ్చునన్నారు. అత్యాధునిక హంగులు, ప్రత్యేకతలతో అందుబాటులోకి వచ్చిన ఈ మోటార్ సైకిల్ ఆకట్టుకుంటోందని తెలిపారు.

 

 

అయితే ఈ సరికొత్త మోటార్ సైకిల్ రోబో ఫేస్ ఎల్ఈడీ హెడ్ ల్యాంపు, సరికొత్త ఎల్ఈడీ టెయిల్ ల్యాంపుతో ఆకట్టుంకుంటోందని తెలిపారు. మస్కూలర్, స్కల్ప్టెడ్ డిజైన్ ఫ్యూయల్ ట్యాంకుతో అందుబాటులోకి వచ్చిన ఈ బైక్ డ్యూయల్ ఔట్ లెట్ ఎక్సాహాస్ట్ ను కలిగి ఉందన్నారు. సరికొత్త గ్రాఫిక్స్, వీల్ స్ట్రీప్స్, స్ప్లిట్ గ్రాబ్ రెయిల్స్, ఫ్రంట్ ఫోర్కుల కోసం స్పోర్టీ లుకింగ్ కవర్ల, సైడ్ ఉన్న లింక్ టైప్ గేర్ షిఫ్టర్లు ఇందులో ఉన్నాయని తెలిపారు.

 


ఇంకా ఈ బైక్ ప్రత్యేకతల దగ్గరకొస్తే డిజిటల్ ఇన్ స్ట్రూమెంట్ కన్సోల్, హజార్డ్ ల్యాంపులు, ఇంజిన్ కిల్ స్విచ్, 582 ఎంఎం పొడవు, 137 ఎంఎం వెడల్పుతో కూడిన సీటును ఈ బైక్ కు ప్రత్యేక ఆకర్షణగా ఈ కమ్యూట్ బైక్స్ కు అందుబాటులో ఉంచారని యాజమాన్యం తెలిపారు. భారత మార్కెట్లో ఈ సరికొత్త హోండా ఎక్స్ బ్లేడ్ మోటార్ సైకిల్ కు పోటీగా హీరో ఎక్స్ ట్రీమ్ 160ఆర్, టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 160 4వీ, బజాజ్ పల్సర్ ఎన్ఎస్ 160, సుజుకీ జిక్సెర్ 155 లాంటి బైక్స్ పోటీగా ఉన్నాయని నిపుణులు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: