ప్రముఖ వాహన సంస్థలో ఒకటైనా బజాజ్ వాహన సంస్థలో ఇప్పుడు మరింత మెరుగుపడింది. త్వరలో భారత మార్కెట్లో కొత్తగా రాబోతున్న ప్లాటినా 100 మోడల్లోని బైక్ లో డిస్క్ వేరియంట్ ను బీఎస్ 6 ఫార్మాట్లో అప్డేట్ చేసి భారత మార్కెట్లో విడుదల చేసింది. మార్కెట్లోని ఎక్క్ షోరూంలో ఈ డిస్క్ వేరియంట్ బైక్ ధరను స్థానికులకు అందుబాటులో ఉండేలా నిర్దేశించారు. భారత మార్కెట్ లో మైలేజీ ఎక్కువగా ఇచ్చే బైక్స్ లలో బజాజ్ ప్లాటినా ముందువరుసలో ఉంటుంది.

 

 

ఇటీవలే ఈ బైక్ కు బీఎస్6 కాలుష్య నియంత్రణ ప్రమాణాలకు అనుగుణంగా మార్పులు చేసి బజాజ్ వాహన సంస్థ భారత మార్కెట్లలో విడుదల చేసింది. తాజాగా సరికొత్త బీఎస్6 ప్లాటినా 100 బైక్ లోని డిస్క్ వేరియంట్ భారత విపణిలోకి లాంచ్ చేసింది. డిల్లీ ఎక్స్ షోరూంలో ప్లాటినా డిస్క్ వేరియంట్ ధర సామాన్యులకు అందుబాటులో రూ.59,373లుగా సంస్థ నిర్దేశించింది. ప్లాటినా లైనప్ లో టాప్ వేరియంట్లలో ఈ బైక్ ప్రత్యేకం కావడం విశేషం. 

 

 

బజాబ్ డిస్క్ వేరియంట్ ధరలు.సరికొత్త బజాజ్ ప్లాటినా డిస్క్ బ్రేక్ వేరియంట్ కాకుండా మరో రెండు వేరియంట్లలో బజాజ్ వాహన సంస్థ బైక్ ను అందుబాటులో తెచ్చింది. ఈఎస్ అల్లాయ్ తో కూడిన డ్రమ్ బ్రేక్స్, కిక్ స్టార్ట్ అల్లాయ్ అనే రెండు వేరియంట్లలో బైక్ ను సామాన్యులకు అందుబాటులో ఉంచింది.ఈఎస్ అల్లాయ్ డ్రమ్ బ్రేక్స్ ధర రూ. 55,546 ఉండగా, కిక్ స్టార్ట్ అల్లాయ్ వేరియంట్ ధర రూ.49,261 గా బజాబ్ వాహన సంస్థ బైక్ ను భారత మార్కెట్లో విడుదల చేసింది. త్వరలో ఈ డిస్క్ బ్రేక్ బైక్ లను భారత వ్యాపార మార్కెట్ లో విడుదల చేసి సామాన్యులకు అందుబాటులో ఉంచబోతుంది బజాజ్ వాహన సంస్థ యాజమాన్యం తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: