ప్రముఖ ఇటాలియన్ వాహన సంస్థ బెనెల్లీ తన కొత్త ఇంపీరియల్ 400 బైక్ ను బీఎస్-6 ఫార్మాట్ లో సరికొత్త ఫీచర్లతో ఆధునీకరించి భారత మార్కెట్ లో విడుదల చేసింది. ఎక్స్ షోరూంలో బైక్ ధర రూ.1.99 లక్షలుగా నిర్ణయించింది.

 

ఇటాలియన్ వాహన సంస్థ ముఖ్యంగా స్పోర్ట్స్ బైక్లను మార్కెట్ లో విడుదల చేసి వాహన ప్రియుల మన్ననను సంపాందించింది. ఆఫ్ రోడ్లపై దుమ్మురేపే మోటార్ సైకిళ్ల లో బెనల్లీ బైక్ ముందు వరుసలో ఉంది. బెనల్లీ ఇంపీరియలే 400 బైక్ ను బీఎస్-6 కాలుష్య నియంత్రణ ప్రమాణాలకు అనుగుణంగా భారత మార్కెట్ లో విడుదల చేసింది.

 

 

బీఎస్-6 బెనెల్లీ ఇంపీరియలే 400 బైక్ మోడల్ ధర రూ.1.99 లక్షలుగా సంస్థ నిర్దేశించింది. బీఎస్-4 మోడల్ తో పోల్చితే ఇంపీరియల్ 400 మోడల్ ధర 20 వేలు అధికం. గతేడాది అక్టోబర్ నెలలో బీఎస్-4 మోడల్ ను రూ.1.69 లక్షలతో లాంచ్ చేసింది. ఈ ఏడాది మార్చిలో దీని ధరను మరో పది వేలు పెంచి రూ.1.79 లక్షలకు పెంచింది.

 

ధరలో మార్పును గమనించినట్లయితే బైక్ లో చేసిన మెకానికల్ ఛేంజెస్ ను గమనించవచ్చు. బెనల్లీ ఇంపీరియల్ 400 బైక్ ను ఇప్పటికే బుక్సింగ్ ప్రారంభించింది. బుకింగ్ కు సంబంధించి రూ.6 వేలుగా నిర్ణయించింది. వచ్చే నెలలో బైక్ లనె డెలీవరీ చేయనున్నట్లు సంస్థ వెల్లడించింది.

 


రెట్రో డిజైన్ లుక్ తో మార్కెట్ లో విడుదలైన బెనెల్లీ ఇంపీరియలే 400 బైక్ టేర్ డ్రాప్ ఆకారంలో ఉన్న ఫ్యూయల్ ట్యాంక్, రబ్బర్ థై ప్యాడ్లు, స్ల్పీట్ సీట్, రౌండ్ హెడ్ ల్యాంప్ క్లస్టర్లు, వైడ్ హ్యాండిల్ బార్లు ప్రత్యేకతలను ఇందులో పొందుపర్చింది.  ఇంకా సెమీ డిజిల్ కన్సోల్ తో కూడిన అన్ లాగ్ ప్యాడ్లు, ట్యాకో మీటర్, స్మాల్ డిజిటల్ డిస్ ప్లే, వైటల్ రెడ్ ఔట్లు, యాంటీ బ్రేకింగ్ వ్యవస్థతో ఇటాలియన్ మోటార్ సంస్థ అందుబాటులో తెచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: