ఎప్పటికప్పుడు కొత్త మోడల్స్ ను రిలీజ్ చేస్తూ వాహనదారుల ఆసక్తిని చూరగొంటున్న కంపెనీలలో ముందుండే కంపెనీ హోండా. అయితే కరోనా వైరస్ నేపథ్యంలో లాక్‌డౌన్‌ పరిస్థితుల దృష్ట్యా ఇప్పటికే అనేక ఆటోమొబైల్ రంగాలు చాలావరకు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో అనేక కొత్త ఉత్పత్తుల మార్కెట్ లాంచ్ లను వాయిదా వేస్తూ వస్తున్నాయి ఆటో రంగం సంస్థలు. ఇదే నేపథ్యంలో వారి దగ్గర ఉన్న పాత స్టాక్ ను అమ్ముకునే విధంగా అనేక ఆఫర్లతో ఊరిస్తున్నాయి ఆటోమొబైల్ రంగం కంపెనీలు. ఇందుకోసం కస్టమర్లకు భారీ ఎత్తున క్యాష్ బ్యాక్ డిస్కౌంట్ అందిస్తున్నాయి. 

IHG


ఇకపోతే తాజాగా హోండా సంస్థ జూలై నెలకు గాను తన బిఎస్ 6 కార్లపై భారీ డిస్కౌంట్స్ ప్రకటించింది. ఇందులో ముఖ్యంగా హోండా అమేజ్, హోండా సిటీ, హోండా సివిక్ లాంటి పేరుగాంచిన మోడల్ కూడా గరిష్టంగా 1.76 లక్షల రూపాయల వరకు కస్టమర్లుకు ప్రయోజనం కలుగబోతోంది. ఈ ఆఫర్ ను జులై 31 వరకు పొడిగించింది హోండా కంపెనీ. 

IHG


ఇక ఇందులో హోండా అమేజ్ పై 27 వేల రూపాయల రాయితీ ఇస్తూనే, కార్ల ఎక్స్చేంజి తీసుకునే వారికి  అదనంగా 15 వేల రూపాయల వరకు కాష్ బ్యాక్ ఇవ్వనుంది. అలాగే కొత్త హోండా అమేజ్ కొనుగోలు చేస్తే 3000 రూపాయల ఇన్స్టంట్ క్యాష్ బ్యాక్ కూడా ఉంది. వీటితో పాటు వివిధ రకాల కార్లపై వారి డిస్కౌంట్లను ప్రకటించింది హోండా సంస్థ. ఇక హోండా సిటీ మోడల్ గరిష్ట ప్రయోజనాలను కస్టమర్లు పొందవచ్చు. అలాగే హోండా సివిక్ డీజిల్ మోడల్ పై గరిష్టంగా రూ 1.5 లక్షల రూపాయల వరకు రాయితీలను అందించబోతున్నారు. అయితే ఈ ఆఫర్ హోండా సివిక్ మోడల్ పై కేవలం జూలై 15 వరకు మాత్రమే.

మరింత సమాచారం తెలుసుకోండి: