భారతీయ ఆటోమొబైల్ రంగ సంస్థల్లో ప్రముఖమైన హ్యుండాయ్ ఇండియా సంస్థ, తాజాగా సరికొత్త వాహనాన్ని భారత మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఇక ఆ కారు పేరు హ్యుండాయ్ టక్సన్ ఫేస్ లిఫ్ట్. ఇక దీని ధర విషయానికి వస్తే... షోరూం లో రూ. 22.3 లక్షలుగా సంస్థ నిర్ధారించింది. ఈ కార్ మనకు మూడు వేరియంట్స్ లో లభ్యం అవుతుంది. జిఎల్ ఎస్, జిఎల్ (ఓ), జిఎల్ ఎస్ (4 డబ్ల్యూ డి) అనే మూడు రకాల కార్లను మనం సొంతం చేసుకోవచ్చు. అయితే ప్రస్తుతం ఈ మూడు వేరియంట్లో కేవలం డీజిల్ యూనిట్ మాత్రమే అందుబాటులోకి వచ్చింది. మిగతా వేరియంట్స్ అతి త్వరలో రిలీజ్ కాబోతున్నాయి.

IHG


ఇక ఈ కార్ డిజైన్ విషయానికి వస్తే..  అత్యాధునిక ఫీచర్లతో పాటు సరికొత్త ప్రత్యేకతలతో ఈ కార్ అందుబాటులోకి వచ్చింది. మిరుమిట్లు గొలిపే ఎల్ఈడి హెడ్ ల్యాంపులు, అతి పెద్ద ఫ్రంట్ గ్రిల్, ఆధునీకరించి బడిన ఫ్రంట్ అండ్ రేర్ బంపర్ లు ఇలా అనేక రకాల కొత్త ప్రత్యేకతలు ఇందులో పొందుపరిచారు.

IHG

 


ఇక ఫీచర్స్ విషయానికి వస్తే... ఇందులో రీడిజైన్ డాష్ బోర్డు తో కూడిన ఫ్లోటింగ్ సిస్టం, ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ లాంటి ఫీచర్లు ఉన్నాయి. వీటితో పాటు మరికొన్ని ఫీచర్లు చూస్తే... పానోరామిక్ సన్ రూఫ్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, ఫ్రెండ్ ప్యాసింజర్ సీట్లు, రిమోట్ ఇంజన్ స్టార్ట్ అండ్ స్టాప్ లాంటి కొన్ని ప్రత్యేకతలు ఈ కారులో పొందుపరిచారు. అలాగే ఈ కార్ ఇంజన్ విషయానికొస్తే 2.0 లీటర్ పెట్రోల్ యూనిట్ ని కలిగి ఉండి, 150 bhp బ్రేక్ హార్స్ పవర్, 192 nm టార్క్ ను ఉత్పత్తి చేయగలుగుతుంది. వీటితో పాటు 6 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వ్యవస్థతో ఈ ఇంజన్ పని చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: