హోండా నుండి కొత్తగా రాబోతున్న సి.బి.ఆర్ 650 ఆర్ మోడల్ అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు పెట్టారు. 15000 ల టోకెన్ ఎమౌంట్ కట్టి ఈ బైక్ ను అడ్వాన్స్ బుక్ చేసుకోవచ్చు. ఇండియాలోని హోండా బైక్ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ సరికొత్త హోండా సి.బి.ఆర్ 650 ఆర్ బైక్ ఎన్నో సరికొత్త హంగులతో వస్తుంది.


అధునాతన సాంకేతిక అప్డేట్స్ తో ఈ బైక్ వసుతంది. ప్రస్తుతం మార్కెట్ లో ఉన్న హోండా సి.బి.ఆర్ 650 ఎఫ్ ను ఇది రీప్లేస్ చేస్తుంది. 8 లక్షల ఎక్స్ షో రూం ప్రైజ్ తో వస్తున్న ఈ బైక్ రైడింగ్ కు ఎంతో అనువుగా ఉండేలా డిజైన్ చేశారు. హోండా సి.బి.ఆర్ 650 ఎఫ్ కు 650 ఆర్ కు పెద్దగా తేడా లేకున్నా టెక్నికల్ అప్డేట్స్ లో ఇది ఇంకొంత బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తుందట.


హోండా నుండి వస్తున్న ప్రత్యేకమైన సౌకర్యాలు కలిగిన ఈ సరికొత్త బైక్ మార్కెట్ లో ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి. ప్రస్తుతం మార్కెట్ లో ఉన్న అన్ని రైడింగ్ బైకులకు గట్టి పోటీ ఇచ్చేలా హోండా సి.బి.ఆర్ 650 ఆర్ సేల్స్ లో ఎలాంటి సత్తా చాటుతుందో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: