టాక్సీ అంటే ముందు కారు కన్నా వచ్చేది ఆటోలే. ప్రతి నగరంలో ఈ ఆటోల సంఖ్య అందరికి తెలిసిందే. ఆటోలను నడుపుతూ జీవనం సాగించే వారి సంఖ్య కూడా అధికంగా ఉంటుంది. త్రి చక్రవాహంతో ఎలాంటి ప్రదేశంలో అయినా ప్రయాణీకులు సౌకర్యవంతంగా తీసుకెళ్లేవే ఆటోలు. అయితే డీజిల్, ఎల్.పి.జి ఇలా ఆటో ఏదైనా కలర్ ఏదైనా మనకు గుర్తుకొచ్చే ఆకారం ఒకటే.. అదే ముందు ఒక చక్రం వెనుక రెండు చక్రాలు మధ్యలో ఆటో బాడీ.


అయితే ఇప్పుడు టివిఎస్ వారు సరికొత్త ఆటో రిక్షాని ఆవిష్కరిస్తున్నారు. అది చూస్తే ముందు నుండి ఆటోలానే అనిపిస్తుంది కాని వెనుక నుండి చూస్తే మాత్రం కారు అంటే నమ్మేస్తారు. ఆర్.ఎల్ ఫైబర్ గ్లాస్ వారు టివిఎస్ మోటార్స్ తో కలిసి ఈ కొత్తరకం ఆటో రిక్షాని సిద్ధం చేశారు. ఈ ఆటోకి నాలుగు డోర్స్ ఉంటాయి.  


లోపల మొత్తం సీటింగ్ కారుని తలపించేలా ఉంటుంది. ఈ ఆటోకి సన్ రూఫ్ సిస్టెం కూడా అందుబాటులో ఉంది. ఆటో బాడీ మొత్తం ఫైబర్ గ్లాస్ ను వాడింది. చూసేందుకు చాలా క్లాస్ గా అనిపిస్తున్న ఈ ఆటో కారుకి ఏమాత్రం తక్కువ కాదని చెప్పొచ్చు. త్వరలో ఇండియన్ మార్కెట్ లోకి ఈ ఆటో రిక్షాలు రిలీజ్ కానున్నాయి. 



మరింత సమాచారం తెలుసుకోండి: