కస్టమర్స్ వాడుకను బట్టే కంపెనీలన్ని తమ ఉత్పత్తులను అందుబాటులో ఉంచేందుకు రంగం సిద్ధం చేసుకుంటాయి. ప్రస్తుతం టూ వీలర్ రంగంలో రారాజుగా ఉన్న హోండా తమ కస్టర్స్ వినియోగదారుల కోసం మరిన్ని ప్రొడక్ట్స్ ను అందుబాటులో ఉంచేందుకు మరో కొత్త మేకింగ్ ప్లాంట్ అందుబాటులో తీసుకువచ్చింది. గుజరాత్ లో ఇప్పటికే మూడు ప్లాంట్లు ఉండగా మరో ప్లాంట్ నిన్న ఘనంగా ప్రారంభించారు నిర్వాహకులు.


మేక్ ఇన్ ఇండియాలో భాగంగా హోండా మోటర్ అండ్ స్కూటర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మరో ప్లాంట్ ను గుజరాత్ లోని వితలపూర్ లో ప్రారంభించింది. 13నెల కాలంలో 1.2 మిలియన్ స్కూటర్లను తయారు చేసే విధంగా ఈ ప్లాంట్ నిర్మాణం జరుగుతుంది. అంతేకాదు దేశం మొత్తం మీద మరో 1100ల హోండా ప్లాంట్లను ప్రారంభించే దిశగా అడుగులు వేస్తుంది హోండా కంపెనీ.


అయితే ఈ ప్లాంట్ల నిర్మాణం వలన మూడు వేల మందికి డైరెక్ట్ ఎంప్లాయ్ మెంట్ అవకాశాలు లభిస్తుండగా.. మరో 6000 మందికి పరోక్షంగా ఎంప్లాయ్ మెంట్ సోర్సెస్ కలిగిస్తుంది కంపెనీ. అంతేకాదు ప్రొడక్షన్ నిర్మాణ రంగంలో కూడా పోయిన సంవత్సరం కన్నా మరో 28% ఎక్కువ రిలీజ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మార్కెట్ లో హోండా బైకుల పర్సెంటేజ్ ఎక్కువగా ఉండటం విశేషం..
ఇక ఈ ప్రోగ్రాం సందర్భంగా గుజరాత్ లోని కొన్ని గ్రామాల్లో ప్లానిటేషన్ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు హోండా కంపెనీ చైర్ పర్సన్స్. దాదాపుగా గుజరాత్ ప్రాంతంలో 10వేల ఫ్రూట్స్ బేరింగ్ ట్రీస్ ను నాటడం జరిగిందట.  


మరింత సమాచారం తెలుసుకోండి: