రాయల్ ఎన్ఫీల్డ్ వాహనదారులకు ఓ గొప్ప అవకాశాన్ని అందిస్తుంది రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ. తమ కస్టమర్స్ కు మరింత సౌకర్యవంతమైన ప్రయోజనాలను అందించే విధంగా రాయల్ ఎన్ఫీల్డ్ ఇక నుండి రోడ్ సైడ్ అసిస్టెన్స్ కూడా ఇచ్చేందుకు సిద్ధమైంది. అంతేకాదు ప్రయాణీకులు తమ ఓనర్ షిప్ ఎక్స్ పీరియెన్సెస్ కూడా షేర్ చేసుకునేలా వెసులుబాటు కలిగిస్తుంది.


అందుకే ప్రత్యేకంగా ఆర్.ఎస్.ఏ రోడ్ సైడ్ అసిస్టెన్స్ ఫర్ రాయల్ ఓనర్స్ ను స్టార్ట్ చేసింది. ఇక ఈ ప్రోగ్రాంలో రాయల్ ఎన్ఫీల్డ్ అన్ని బైకులు రోడ్ సైడ్ ఫ్రీ సర్వీస్ ను పొందగలవు. కాని 5 సంవత్సరాల లోపు తీసుకున్న వారికే ఈ ఫ్రీ సర్వీస్ అందుబాటులో ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే బైక్ తీసుకుని సంవత్సర కాల వ్యవధి అయిన వారికి ఇది పూర్తిగా ఉచితంగా సేవలు అందిస్తుంది. 


ఇక 1 నుండి 3 సంవత్సరాల కలిగిన ఓనర్స్ ఈ సర్వీసులను సంవత్సరానికి 800 రూపాయలు చెల్లించి సేవలు వినియోగించుకోవచ్చు. ఇక 3 నుండి 5 సంవత్సరాలు కాల వ్యవధి గల వారికి సంవత్సరానికి 1000 రూపాయలను చార్జ్ చేయడం జరుగుతుంది. ఈ సర్వీస్ లు మెకానికల్ గా కాని.. ఎలెక్ట్రికల్ గా కాని ప్రాబ్లెం ఉన్న వారికి సర్వీస్ అందిస్తారు. ఇక రోడ్ సైడ్ అసిస్టెన్స్ కోసం టోల్ ఫ్రీ నెంబర్  1800-2100-007 కు కాల్ చేసి మిగతా వివరాలు తెలుసుకోవచ్చు.    
 


మరింత సమాచారం తెలుసుకోండి: