మధ్యతరగతి వాహనాలుగా మారుతి సుజుకి వారికి తగిన ధరలకు వాహనాలను అందిస్తుంది. అందుకే మారుతి సుజుకి సేల్స్ కు అందరు ముక్కున వేలేసుకుంటారు. జూలై లో అత్యధికంగా అమ్ముడైనా కార్లలో టాప్ టెన్ లో 7 మారుతి సుజుకి మోడల్ల వెహికల్స్ చోటు సంపాదించుకున్నాయంటే మారుతి సుజుకి హవా ఏవిధంగా కొనసాగుతుందో చెప్పొచ్చు.


జూలై నెల ఆధారంగా ఏర్పాటు చేసిన ఈ నివేదికలో టాప్ 10 లో మొదటి ఐదు స్థానాల్లో మారుతి వెహికల్స్ ఉండటం విశేషం. అన్నిటికన్నా మొదటి స్థానలో మారుతి ఆల్టో మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత బలెనో, వాగనార్, విటెరా బ్రెజా, స్విఫ్ట్ ఉన్నాయి.. ఇక మళ్లీ 8,9 స్థానాల్లో సెడాన్ డిజైర్, సెలెరియో వెహికల్స్ మారుతి నుండి టాప్ టెన్ లో ఉన్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: