ప్రంపంచ ప్రఖ్యాత గాంచిన ఫోర్ వీలర్ లో ఆడి వెహికల్స్ ఒకటని తెలిసిందే. సంపన్నుల వాహనంగా సూపర్ క్రేజ్ తెచ్చుకున్న ఆడి ఇప్పుడు పెట్రోల్ ఇంజిన్ తో వచ్చేందుకు సిద్ధమవుతుంది. ఆడి క్యూ-7 టర్బో చార్జెడ్ పెట్రోల్ ఇంజిన్ తో రాబోతుంది. 4 సిలిండర్ ఇంజిన్ డెవలప్స్ తో వస్తున్న ఈ వెహికల్ 252 పిఎస్ పవర్ సిస్టెం తో 370 ఎన్నెం పీక్ టార్క్ తో అందుబాటులో వస్తుంది.


ఈ వెహికల్ 8 స్పీడ్ ఆటో ట్రాన్స్ మిషన్స్ తో వస్తుంది. ఆడి క్యూ-7 40 టి.ఎఫ్.ఎస్.ఐ కేవలం 6.9 సెకన్స్ లోనే 0 నుండి 100 కిలోమీటర్స్ స్పీడ్ అందుకోగలదు. ఇక ఈ వెహికల్ పర్ లీటర్ 11.698 కిలోమీటర్స్ మైలేజ్ ఇస్తుంది. మరి ఆడి క్యూ-7 వెహికల్ కావాలనుకునే వారి దగ్గరలోని ఆడి షో రూమ్ ను సంప్రదించండి. ఈ వెహికల్ యొక్క ధర క్యూ-7 టి.ఎఫ్.ఎస్.ఐ ప్రీమియం ప్లస్ అయితే 67.76 లక్షలు ఉండగా.. టెక్నాలజీ ప్యాక్ అయితే 74.43 లక్షలుగా నిర్ణయించబడింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: