హోండా నుండి వచ్చిన స్కూటర్ విభాగంలో యాక్టివా అంచనాలకు మించి కస్టమర్స్ ను సాటిస్ఫై చేసింది. అందుకే ఇప్పుడు స్కూటర్ విభాగంలో అత్యధిక సేల్స్ కలిగి ఉంది హోండా యాక్టివా. ఇక ఇప్పుడు హోండా నుండి సరికొత్త స్కూటర్ గ్రేజియా మార్కెట్ లోకి రిలీజ్ కాబోతుంది. 125 సిసి కెపాసిటీతో రాబోతున్న ఈ వెహికల్ అక్టోబర్ 25 నుండి ఇండియా మార్కెట్ లో అందుబాటులో ఉంటుంది.


అడ్వాన్స్ అర్బన్ స్కూటర్ గా రాబోతున్న ఈ హోండా గ్రేజియా హోండా యాక్టివాకు ఏమాత్రం తీసిపోని విధంగా ఉంటుందని తెలుస్తుంది. ఇక ఈ స్కూటర్ ధర 55 వేల నుండి 60 వేల వరకు ఉండొచ్చని అంచనా. 8.5 పిఎస్, 6500 ఆర్పిఎం, 10.54 ఎన్నెం టార్క్ తో ఈ స్కూటర్ అందుబాటులో ఉంటుంది.   


మరింత సమాచారం తెలుసుకోండి: