సుజుకి నుండి సరికొత్త బైక్ మార్కెట్ లోకి రిలీజ్ అవుతుంది. సుజుకి ఇంట్రుడర్ 150 గా వస్తున్న ఈ బైక్ నవంబర్ 7న ఇండియా మార్కెట్ లోకి రిలీజ్ అవుతుంది. సుజుకి నుండి వచ్చిన జిక్సర్ మోడల్ కు సరికొత్త అప్డేట్స్ తో ఈ ఇంట్రుడర్ 150 వస్తుంది. 155 సిసి కెపాసిటీ ఇంజిన్ తో వస్తున్న ఈ బైక్ 14.8 పిఎస్ పవర్ సిస్టెంతో పాటుగా 14 ఎన్నెం టార్క్ తో అందుబాటులో ఉంటుంది.


5 స్పీడ్ గేర్ సిస్టెం కలిగిన ఈ బైక్ ధర ప్రస్తుతం 1 లక్ష రూపాయలని నిర్ణయించబడింది. ఇక ఈ బైక్ గురించి మరిన్ని డీటేల్స్ కావాలనుకుంటే దగ్గరలో ఉన్న సుజుకి షోరూంను సంప్రదించండి. జిక్సర్ బేస్డ్ మోడల్ తోనే సుజుకి నుండి రాబోతున్న ఈ సరికొత్త బైక్ కచ్చితంగా కస్టమర్స్ ను సాటిస్ఫై చేస్తుందని చెబుతున్నారు కంపెనీ నిర్వాహకులు.   



మరింత సమాచారం తెలుసుకోండి: